ఒకటిస్తే.. దానికి రెండింతలు తిరిగిస్తా: పంత్
విరామ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న పంత్.. ఆసీస్ పర్యటనలో స్లెడ్జింగ్‌ను రిషభ్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. తన స్లెడ్జింగ్‌ను తన తల్లి, సోదరి కూడా చక్కగా ఎంజాయ్ చేశారని రిషభ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

విరామ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న పంత్.. ఆసీస్ పర్యటనలో స్లెడ్జింగ్‌ను రిషభ్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. తన స్లెడ్జింగ్‌ను తన తల్లి, సోదరి కూడా చక్కగా ఎంజాయ్ చేశారని రిషభ్ తాజాగా చెప్పుకొచ్చాడు.
దెబ్బకు దెబ్బ అన్నట్లుగా మాటకు మాట సమాధానమిచ్చాడు పంత్. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో రిషభ్ పంత్-టిమ్ పైన్‌ల మధ్య సాగిన స్లెడ్జింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు పంత్‌ను ఉద్దేశించి ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ తన పిల్లలను చూసుకుంటే తాను సినిమాకు వెళ్తానంటూ స్టెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దానికి మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేసిన రిషభ్ సిరీస్‌కే హైలెట్‌గా నిలిచాడు. ఈ టెస్టు సిరీస్‌లో రిషభ్ పంత్ స్లెడ్జింగ్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా హల్‌చల్ చేసింది. ఈ క్రమంలో పైన్‌తో పాటు ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్‌లను సైతం తన స్లెడ్జింగ్‌తో తిప్పికొట్టాడు రిషభ్.
టెస్టు సిరీస్‌లో తన సత్తా చాటిన యువ క్రికెటర్ వన్డే జట్టులో చోటు కోల్పోవడంతో స్వదేశానికి తిరిగొచ్చాడు. విరామ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న పంత్.. ఆసీస్ పర్యటనలో స్లెడ్జింగ్‌ను రిషభ్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. తన స్లెడ్జింగ్‌ను తన తల్లి, సోదరి కూడా చక్కగా ఎంజాయ్ చేశారని రిషభ్ తాజాగా చెప్పుకొచ్చాడు.
‘నేను జట్టు కోసం ఏమి చేయాలో అదే చేశా. నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే అంతే గట్టిగా బదులివ్వాలనుకున్నా. అదే సమయంలో కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాన్ని కూడా మరిచిపోలేదు. నిబంధనలకు లోబడే స్లెడ్జింగ్‌కు పాల్పడ్డా. ఎక్కడా హద్దు మీరకుండా జాగ్రత్తపడ్డా. ఈ స్లెడ్జింగ్‌ను అభిమానులు కూడా ఇష్టపడ్డారు. నా తల్లి, నా సోదరి సైతం స్లెడ్జింగ్ చేసిన విధానాన్ని బాగా ఎంజాయ్ చేశారు’ అని రిషభ్ అన్నాడు. తాను ఆదర్శంగా తీసుకునే వారిలో ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఎంఎస్ ధోనిలు ముందు వరుసలో ఉంటారని రిషభ్ తెలిపాడు. అది అభిమానం వరకేనని వాళ్లని కాపీ కొట్టానని వెల్లడించాడు.