Rishabh Pant : దులీప్ ట్రోఫీలో రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ దులీప్ ట్రోఫీలో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

Rishabh Pant Takes Stunning Catch On Return To Red Ball Cricket
Rishabh Pant : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ దులీప్ ట్రోఫీలో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇండియా-బి జట్టుకు ఆడుతున్న పంత్ బెంగళూరు వేదికగా ఇండియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్ల వెనుక అసాధారణ క్యాచ్ అందుకున్నాడు.
నవదీప్ సైనీ బౌలింగ్‌లో ఇండియా-ఏ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (36) లెగ్ సైడ్ దిశగా బంతిని ఆడాలని చూశాడు. అయితే.. బాల్ ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనుక వైపుగా వెళ్లింది. తనకు చాలా దూరంలో బంతి వెలుతుండడంతో పంత్ తన ఎడమ వైపు చక్కని డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో మయాంక్ తీవ్ర నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పంత్ చివరి సారిగా టీమ్ఇండియా తరుపున సుదీర్ఘ పార్మాట్‌లో డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. సిరీస్ ముగిసిన తరువాత పంత్ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు. దాదాపు 15 నెలల పాటు ఆటకు దూరం అయ్యాడు. గాయాల నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్ 2024తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో రాణించి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఇక టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు పంత్ సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే దేశవాలీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో అతడు పాల్గొంటున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలో ఇండియా-బి తరుపున బరిలోకి దిగాడు. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో అతడు బ్యాట్‌తో నిరాశపరిచాడు. 10 బంతులు ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ విఫలమైనా ముషీర్ ఖాన్ రాణించడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసింది. అనంతరం ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇండియా-బికి 90 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ లభించింది.
Yograj Singh : అర్జున్ టెండూల్కర్ కెరీర్‌పై యువీ తండ్రి యోగరాజ్ సింగ్ కామెంట్స్.. బొగ్గు గనిలో..
You can’t keep away Rishabh Pant from Game 🙌🏻🥵
what A Catch by Spider Man Rishabh Pant 🙌🏻pic.twitter.com/ttMi9kHXPa— rishabh_dines17 (@Rishabh_pant717) September 6, 2024