Ishant Sharma : రిష‌బ్‌పంత్ ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌డు.. వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌కు డౌటే..! టీమ్ఇండియా పేసర్‌ కీల‌క వ్యాఖ్య‌లు

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) మ‌ళ్లీ మైదానంలో ఎప్పుడు అడుగుపెడ‌తాడా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Ishant Sharma : రిష‌బ్‌పంత్ ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌డు.. వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌కు డౌటే..! టీమ్ఇండియా పేసర్‌ కీల‌క వ్యాఖ్య‌లు

Rishabh Pant

Ishant Sharma-Rishabh Pant : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) మ‌ళ్లీ మైదానంలో ఎప్పుడు అడుగుపెడ‌తాడా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదానికి గురైన పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఫిట్‍నెస్ సాదించే ప‌నిలో ఉన్నాడు. తాజాగా అత‌డు బ్యాటింగ్‌, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు అప్‌డేట్ ఇచ్చింది.

దీంతో వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ నాటికి పంత్ జ‌ట్టుతో క‌లుస్తాడ‌ని స‌గ‌టు క్రికెట్ అభిమాని భావిస్తున్న క్ర‌మంలో టీమ్ ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ఇషాంత్ శ‌ర్మ(Ishant Sharma) చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. ప్ర‌పంచ క‌ప్ కాదుక‌దా.. వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో సైతం పంత్‌ను చూడ‌డం క‌ష్ట‌మేన‌ని ఇషాంత్ అన్నాడు. స్వదేశంలో ఈ ఏడాది అక్టోబ‌ర్‌-న‌వంబ‌ర్ మ‌ధ్య జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యానికి పంత్ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించ‌డం క‌ష్ట‌మ‌ని తాను ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌ని తెలిపాడు.

IND vs WI 2nd test : నిప్పులు చెరిగిన మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. వెస్టిండీస్ 255 ఆలౌట్‌.. భార‌త్‌కు భారీ ఆధిక్యం

జియో సినిమాస్‌తో ఇషాంత్ మాట్లాడుతూ.. పంత్ కి అయిన యాక్సిడెంట్ చాలా తీవ్ర‌మైన‌దని, అత‌డు ఇప్పుడే బ్యాటింగ్‌, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొద‌లుపెట్టాడన్నారు. ఇంకా అత‌డు ప‌రిగెత్త‌డం, ఇటూ అటూ తిర‌గాలి. మ‌రెన్నో విష‌యాలు ఉన్నాయి. వికెట్ కీపింగ్ చేయాలంటే చాలా ఫిట్‌నెస్ అవ‌స‌రం. కాబ‌ట్టి అత‌డిని త‌దుప‌రి ఐపీఎల్‌లో కూడా చూడ‌లేమ‌ని అభిప్రాయాన్ని ఇషాంత్ వ్య‌క్తం చేశాడు.

ఇక్క‌డ ఓ మంచి విష‌యం ఏమిటంటే అత‌డికి రెండో స‌ర్జ‌రీ అవ‌స‌రం లేక‌పోవ‌డం అని చెప్పాడు. ఒక వేళ రెండో శ‌స్త్ర చికిత్స జ‌రిగి ఉంటే కోలుకునేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేద‌న్నాడు. స్వ‌దేశంలో జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు అత‌డు సిద్ధం కాలేడ‌నే విష‌యాన్ని మాత్రం తాను ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌ని పేర్కొన్నాడు. ఇక వ‌చ్చే ఏడాది జ‌రిగే ఐపీఎల్‌లో ఆడినా అది చాలా గొప్ప విష‌య‌మేన‌ని ఇషాంత్ అన్నాడు.

Aiden Markram : ప్రియురాలిని పెళ్లాడిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్.. అత్త బాగుందంటూ..!

ఇషాంత్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.