Rohit and Gambhir first meeting since ODI captaincy switch results in intense chat
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం (అక్టోబర్ 19 )నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టు తొలి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనున్న పెర్త్‌కు చేరుకుంది. గురువారం వాకా స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్‌ను భారత జట్టు నిర్వహించింది.
ఈ సిరీస్‌కు ముందు భారత క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్‌ను నిలిపినప్పటికి కూడా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మను వన్డే కెపెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. యువ ఆటగాడు, టెస్టు కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌కు వన్డే సారథ్య బాధ్యతలను అప్పగించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆసీస్‌తో జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. ఆసీస్ గడ్డ పై అడుగుపెట్టిన వెంటనే టీమ్ఇండియా ఆటగాళ్లు వాకా స్టేడియానికి చేరుకున్నారు. తమ ప్రాక్టీస్ సెషన్‌ను మొదలు పెట్టారు. తొలి ప్రాక్టీస్ సెషన్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చమటోడ్చారు. దాదాపు 30 నిమిషాల తరువాత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో బౌండరీ లైన్ వద్ద తీవ్రంగా చర్చించాడు. హిట్‌మ్యాన్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తరువాత వీరిద్దరి మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే కావడంతో అందరి దృష్టి నెలకొంది.
🚨A moment of discussion between India Head Coach Gautam Gambhir and Rohit Sharma.
Full Video: https://t.co/kPcjPrmLDp@ThumsUpOfficial @rohitjuglan #RohitSharma #GautamGambhir #TeamIndia #AUSvsIND pic.twitter.com/2Nms5eiNf4
— RevSportz Global (@RevSportzGlobal) October 16, 2025
వారిద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్న అంశాలు స్పష్టంగా తెలియనప్పటికి కూడా ఆసీస్ పర్యటనలో ఎలా రాణించాలి అన్నదానిపై మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.
రో-కోకు ఆసీస్ సిరీస్ కీలకం..
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వీరిద్దరు టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో విఫలమైతే మాత్రం వారు వన్డేలకు వీడ్కోలు చెప్పక తప్పదని పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీలు ఎలా ఆడతారు అన్నదానిపైనే అందరి దృష్టి నెలకొంది.