IND vs PAK : పాక్ పై ఘన విజయం.. బౌలర్లకు క్రెడిట్ ఇచ్చిన రోహిత్ శర్మ.. కోహ్లీ శతకం పై ఏమన్నాడంటే?
పాకిస్తాన్ పై విజయం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

Rohit Sharma comments after winning the match against Pakistan
దాయాదుల పోరులో భారత్ విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి భారత్ దాదాపుగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఓడిపోయిన పాక్ దాదాపుగా ట్రోర్నీ నుంచి నిష్ర్కమించింది. సాంకేతికంగా మాత్రమే ఆ జట్టు ఇంకా రేసులో ఉంది.
టీమ్ఇండియా విజయం పై మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పాక్ పై విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. భారత బౌలర్లతో పాటు కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీనిపై హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. బంతితో బౌలర్లు ఆరంభించిన తీరు బాగుందన్నాడు. బౌలర్లు గొప్పగా బంతులు వేసి పాక్‌ను చాలా తక్కువ స్కోరుకే పరిమితం చేశాడని తెలిపారు.
Champions Trophy: భారత్ చేతిలో ఓడినప్పటికీ పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశం..! ఎలా అంటే..
దుబాయ్ పిచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చాడు. పిచ్ స్లో గా మారుతుందనే విషయం తమకు తెలుసునన్నాడు. బ్యాటింగ్‌లో అనుభవం ఉన్న ప్లేయర్ రాణించాలని కోరుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలదే ఈ గెలుపు క్రెడిట్. ఈ ముగ్గురు మిడిల్ ఓవర్లలో చాలా చక్కగా బంతులు వేశారని మెచ్చుకున్నాడు. ఇక రిజ్వాన్-షకీల్ అద్భుత భాగస్వామ్యం పై రోహిత్ శర్మ మాట్లాడుతే.. వారిద్దరు చక్కగా ఆడారన్నాడు. వీలైనంత త్వరగా సదరు భాగస్వామ్యాన్ని విడదీయాలని అనుకున్నట్లుగా తెలిపాడు. స్పిన్నర్లు తమ అనుభవాన్ని ఉపయోగించి చక్కగా బౌలింగ్ చేసి మ్యాచ్ పై పట్టు సాధించేలా చేశారన్నాడు. పేసర్లు షమీ, హార్దిక్, హర్షిత్‌లు సైతం చక్కగా బౌలింగ్ చేశారని చెప్పుకొచ్చారు. ఇక ఆరు బౌలింగ్ ఆప్షన్స్ ఉండడంతో కొందరు 10 ఓవర్ల కోటాను వేయలేకపోతున్నారన్నాడు.
కోహ్లీ శతకానికి ఆశ్చర్యపోలేదు..
గత కొన్నేళ్లుగా కోహ్లీ ఇలాగే రాణిస్తున్నాడని, అతడి సెంచరీ చూసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారు ఎవరూ ఆశ్చర్యపోలేదన్నారు. ఇలాంటి తరహా ఇన్నింగ్స్ ఆడాలని కోహ్లీ భావిస్తూ ఉంటాడన్నారు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించడం బాగుందన్నాడు. కోహ్లీతో పాటు గిల్, అయ్యర్ సైతం కీలక ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నట్లుగా రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక తనకు ఎలాంటి గాయం కాలేదని, తొడ కండరాలు పట్టేయడంతోనే మైదానాన్ని వీడినట్లుగా చెప్పాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉందన్నాడు.