IND vs PAK : వన్డేల్లో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. హిట్‌మ్యాన్‌ను మించిన ఓపెనర్ లేడురా అయ్యా..
వన్డేల్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

Rohit Sharma creates history breaks Sachin Tendulkar world record
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగులు సాధించిన ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు ఒక్క పరుగు వద్ద హిట్‌మ్యాన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
197 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ ఈ రికార్డు సాధించగా రోహిత్ శర్మ కేవలం 181 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోవడం విశేషం. ఇక ఓవరాల్‌గా తీసుకుంటే.. ఓపెనర్‌గా వన్డేల్లో 9 వేలకు పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో ప్లేయర్‌గా రికార్డుకు ఎక్కాడు రోహిత్.
FASTEST TO COMPLETE 9000 RUNS AS AN OPENER IN ODIs:
Rohit Sharma – 181 innings
Sachin Tendulkar – 197 innings pic.twitter.com/XXx7yyvS9V
— Johns. (@CricCrazyJohns) February 23, 2025
ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 15 బంతులు ఎదుర్కొన్నాడు. 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 20 పరుగులు చేశాడు.
వన్డేల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు రోహిత్ శర్మ సొంతం. ఈ ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలను చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు రోహిత్ పేరిటే ఉంది. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 270 వన్డేలు ఆడిన రోహిత్..48.89 సగటుతో 11049 పరుగులు చేశాడు. ఇందులో 32 శతకాలు, 57 అర్థశతకాలు ఉన్నాయి.
Virat Kohli : క్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ రికార్డు.. అజారుద్దీన్ రికార్డు బ్రేక్..
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 15,310 పరుగులు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 12,740 పరుగులు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 10,179 పరుగులు
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 9,200 పరుగులు
సౌరవ్ గంగూలీ (భారత్) – 9,146 పరుగులు
రోహిత్ శర్మ (భారత్) – 9,019 పరుగులు