Virat Kohli : క్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ రికార్డు.. అజారుద్దీన్ రికార్డు బ్రేక్..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

Kohli Breaks Azharuddin Record To Become Indias Most Successful Fielder In ODIs
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డును సాధించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నసీమ్ షా ఇచ్చిన క్యాచ్ ను అందుకోవడంతో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేశాడు.
334 వన్డేల్లో అజారుద్దీన్ 156 క్యాచ్‌లు అందుకోగా 299 మ్యాచ్‌ల్లో కోహ్లీ 157 క్యాచ్‌లు అందుకోవడం విశేషం. వీరిద్దరి తరువాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లు ఉన్నారు.
🚨 HISTORY CREATED BY KOHLI. 🚨
– Virat Kohli has the most catches for India in ODI history – 157*. pic.twitter.com/rkX5xibxEa
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్లు వీరే..
విరాట్ కోహ్లీ -157 క్యాచ్‌లు
మహ్మద్ అజారుద్దీన్ – 156 క్యాచ్‌లు
సచిన్ టెండూల్కర్ – 140 క్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ – 124 క్యాచ్‌లు
సురేశ్ రైనా – 102 క్యాచ్‌లు
IND vs PAK : అరెరె అదా సంగతి.. స్టాండ్స్‌లో ప్రియురాలు.. గ్రౌండ్‌లో రెచ్చిపోతున్న ప్లేయర్
ఓవరాల్‌గా చూసుకుంటే శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేలా జయవర్థనే వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. జయవర్థనే 218 క్యాచ్‌లు అందుకున్నాడు. 160 క్యాచ్‌లతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.
వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లు వీరే..
మహేలా జయవర్థనే (శ్రీలంక) – 218 క్యాచ్‌లు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 160 క్యాచ్‌లు
విరాట్ కోహ్లీ (భారత్) – 157 క్యాచ్‌లు
మహ్మద్ అజారుద్దీన్ – 156 క్యాచ్‌లు
రాస్ టేలర్ (న్యూజిలాండ్) – 142 క్యాచ్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ ( 62; 76 బంతుల్లో 5 ఫోర్లు) అర్థశతకంతో మెరిశాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46; 77 బంతుల్లో 3 ఫోర్లు) ఖుష్‌దిల్ షా (38) లు రాణించారు.
IND vs PAK : అక్షర్ పటేల్ సూపర్ త్రో.. మేనల్లుడు రనౌట్.. మామయ్య ఫోటోతో మీమ్స్..
బాబర్ ఆజామ్ (23) ఫర్వాలేదనిపించాడు. ఇమామ్ ఉల్ హక్ (10), ఆఘా సల్మాన్ (19), తయ్యబ్ తాహిర్ (4)లు విఫలం అయ్యారు. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.