IND vs PAK : అక్ష‌ర్ ప‌టేల్ సూప‌ర్ త్రో.. మేన‌ల్లుడు ర‌నౌట్‌.. మామ‌య్య ఫోటోతో మీమ్స్‌..

భార‌త్‌తో మ్యాచ్‌లో ఇమామ్ ఉల్ హ‌క్ ర‌నౌట్ అయ్యాడు.

IND vs PAK : అక్ష‌ర్ ప‌టేల్ సూప‌ర్ త్రో.. మేన‌ల్లుడు ర‌నౌట్‌.. మామ‌య్య ఫోటోతో మీమ్స్‌..

IND vs PAK Imam ul Haq Run Out Triggers Epic Inzamam ul Haq Memes

Updated On : February 23, 2025 / 4:19 PM IST

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదిక‌గా భార‌త్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ ఓపెన‌ర్ ఇమామ్ ఉల్ హ‌క్ ర‌నౌట్ అయ్యాడు. 26 బంతులు ఆడిన ఇమామ్ కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఇన్నింగ్స్ ప‌దో ఓవ‌ర్‌ను కుల్దీప్ యాద‌వ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతిని ఇమామ్ ఉల్ హ‌క్ మిడాన్ దిశ‌గా షాట్ ఆడి సింగిల్ కోసం ప్ర‌య‌త్నించాడు. అయితే.. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న అక్ష‌ర్ ప‌టేల్ బంతిని అడ్డుకుని మెరుపు వేగంతో డైరెక్ట్ త్రోతో వికెట్ల‌ను పడ‌గొట్టాడు. దీంతో ఇమామ్ ఉల్ హ‌క్ నిరాశ చెందాడు. చాలా బాధ‌తో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

IND vs PAK : ఇండియా పాక్ మ్యాచ్‌లో బాబ‌ర్ ఆజామ్‌ అరుదైన ఘ‌న‌త‌..

వాస్త‌వానికి ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఎంపిక జ‌ట్టులో ఇమామ్ ఉల్ హ‌క్‌కు చోటు ద‌క్క‌లేదు. అయితే.. న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో ఓపెన‌ర్ ఫ‌ఖార్ జ‌మాన్ గాయ‌ప‌డ‌డంతో ఇమామ్ ఉల్ హ‌క్‌ను ఎంపిక చేశారు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భార‌త్‌తో మ్యాచే అత‌డికి తొలి మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో అత‌డు విఫ‌లం అయ్యాడు. దీంతో నెటిజ‌న్లు అత‌డిని ఏకీపారేస్తున్నారు. పాక్ దిగ్గ‌జ ఆట‌గాడు ఇంజామామ్ ఉల్ హ‌క్ మేన‌ల్లుడే ఇమామ్ ఉల్ హ‌క్‌. ఇక ఇంజామామ్ తాను క్రికెట్ ఆడే రోజుల్లో చాలా స్లో ప‌రుగెత్తే వాడు ఈ క్ర‌మంలో చాలా సార్లు ర‌నౌట్ అయ్యాడు.

Mohammed Shami : ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు 9 కిలోల బ‌రువు త‌గ్గిన ష‌మీ.. ఒక్క పూట భోజనం.. ఫిట్‌నెస్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ఇప్పుడు ఇమామ్ సైతం ర‌నౌట్ కావ‌డంతో మామ‌య్య ఇంజామామ్ మీమ్స్‌తో నెటిజ‌న్లు హోరెత్తిస్తున్నారు.