IND vs PAK : ఇండియా పాక్ మ్యాచ్‌లో బాబ‌ర్ ఆజామ్‌ అరుదైన ఘ‌న‌త‌..

పాక్ స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజామ్ ఐసీసీ వ‌న్డే ఇంట‌ర్నేష‌నల్ టోర్నీల్లో అరుదైన ఘ‌నత సాధించాడు.

IND vs PAK : ఇండియా పాక్ మ్యాచ్‌లో బాబ‌ర్ ఆజామ్‌ అరుదైన ఘ‌న‌త‌..

Babar Azam completes 1000 runs in ICC ODI tournaments

Updated On : February 23, 2025 / 3:53 PM IST

పాకిస్తాన్ స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజామ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐసీసీ వ‌న్డే ఇంట‌ర్నేష‌న‌ల్ టోర్నీల్లో 1000 ప‌రుగులు పూర్తి చేసిన మూడో పాక్ బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఆదివారం దుబాయ్ వేదిక‌గా భార‌త్‌తో మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

టీమ్ఇండియా పేస‌ర్ హ‌ర్షిత్ రాణా బౌలింగ్‌లో క‌వ‌ర్ దిశ‌గా బౌండ‌రీ సాధించిన త‌రువాత ఆజామ్ ఈ రికార్డును చేరుకున్నాడు. 24 ఇన్నింగ్స్‌ల్లో బాబ‌ర్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ స్టార్ బ్యాట‌ర్లు స‌యూద్ అన్వ‌ర్‌, జావేద్ మియాందాద్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

IND vs PAK : ఇండియా పాక్ మ్యాచ్ లో షమీ ఓ ‘చెత్త’ రికార్డు..

ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ ఆజామ్ 26 బంతుల‌ను ఎదుర్కొన్నాడు. 5 ఫోర్లు బాది 23 ప‌రుగులు సాధించాడు.

ఐసీసీ వ‌న్డే ఇంట‌ర్నేష‌న్ టోర్నీల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన పాక్ బ్యాట‌ర్లు..

* స‌యూద్ అన్వ‌ర్ – 25 ఇన్నింగ్స్‌ల్లో 1204 ప‌రుగులు
* జావెద్ మియాందాద్ – 30 ఇన్నింగ్స్‌ల్లో 1083 ప‌రుగులు
* బాబ‌ర్ ఆజామ్ – 24 ఇన్నింగ్స్‌ల్లో 1005 ప‌రుగులు
* మహ్మద్ యూసుఫ్ – 25 ఇన్నింగ్స్‌ల్లో 870 ప‌రుగులు
* మిస్బా-ఉల్-హక్ – 19 ఇన్నింగ్స్‌ల్లో 865 ప‌రుగులు.