IND vs PAK : అరెరె అదా సంగతి.. స్టాండ్స్‌లో ప్రియురాలు.. మైదానంలో అదరగొట్టిన పాండ్యా..
భారత్, పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు.

Hardik Pandya rumoured girlfriend Jasmin Walia spotted in India vs Pakistan clash
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు చాలా మంది ప్రముఖులు వచ్చారు. అయితే.. చాలా మంది దృష్టి ఓ అమ్మాయి పై పడింది. ఆమె మరెవరో కాదు హార్దిక్ పాండ్యా రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ వాలియా.
హార్దిక్ పాండ్యా 2020లో సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అగస్త్యఅనే కుమారుడు జన్మించాడు. అయితే.. వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. గతేడాది వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.
IND vs PAK : అక్షర్ పటేల్ సూపర్ త్రో.. మేనల్లుడు రనౌట్.. మామయ్య ఫోటోతో మీమ్స్..
కాగా.. గత కొంతకాలంగా బ్రిటిష్ గాయని, టెలివిజన్ నటి జాస్మిన్ వాలియాతో హార్దిక్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. గ్రీస్‌లోని ఒకే హోటల్ నుంచి ఇద్దరూ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కథనాలు ప్రారంభం అయ్యాయి. దీనిపై అటు హార్దిక్ గానీ, ఇటు జాస్మిన్ గానీ స్పందించలేదు.
కాగా.. నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్‌లో జాస్మిన్ సందడి చేసింది. ఆమె అక్షర్ పటేల్ భార్యతో కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తూ కనిపించింది. వికెట్ తీసిన ప్రతిసారి టీమ్ఇండియా ఆటగాళ్లను ఉత్సాహపరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
IND vs PAK : ఇండియా పాక్ మ్యాచ్ లో షమీ ఓ ‘చెత్త’ రికార్డు..
జాస్మిన్ వాలియా ఎవరు?
జాస్మిన్ వాలియా భారత సంతతికి చెందిన బ్రిటిష్ గాయని, టెలివిజన్ నటి. జాక్ నైట్‌తో కలిసి ఆమె పాడిన “బోమ్ డిగ్గీ” అనే ట్రాక్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాట మనదేశంలోనూ వైరల్‌గా మారింది. కార్తీక్ ఆర్యన్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘సోను కే టిటు కి స్వీటీ’లో కూడా సందడి చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ను హార్దిక్ పాండ్యానే అందించాడు. 26 బంతుల్లో 23 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన బాబర్ ఆజామ్‌ను ఔట్ చేశాడు. ఇక క్రీజులో పాతుకు పోయి సెంచరీ దిశగా వెలుతున్న సౌద్ షకీల్ (62; 76 బంతుల్లో 5 ఫోర్లు)ను సైతం వెనక్కి పంపాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో పాండ్యా 8 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
Hardik pandya and Axar Patel Supporter in the stands at Dubai..!🤣 pic.twitter.com/Rcyh9KOpoX
— ANSH • (@Anshy9451) February 23, 2025