Rohit Sharma : ధోని అరుదైన కెప్టెన్సీ రికార్డును స‌మం చేసిన రోహిత్ శ‌ర్మ‌.. విరాట్ కోహ్లీ, స‌చిన్ వ‌ల్ల కాలేదు..

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.

Rohit Sharma : ధోని అరుదైన కెప్టెన్సీ రికార్డును స‌మం చేసిన రోహిత్ శ‌ర్మ‌.. విరాట్ కోహ్లీ, స‌చిన్ వ‌ల్ల కాలేదు..

Rohit Sharma equal MS Dhoni's rare captaincy record

Rohit Sharma-MS Dhoni : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్న రెండో భార‌త కెప్టెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. టీమ్ఇండియా కెప్టెన్ల‌లో మ‌హేంద్ర సింగ్ ధోని త‌రువాత ఈ ఘ‌న‌త‌ను అందుకుంది ఒక్క రోహిత్ శ‌ర్మ కావ‌డం విశేషం. కేప్‌టౌన్‌లో ముగిసిన రెండో టెస్టులో భార‌త్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించడంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ 1-1తో స‌మ‌మైంది. అంత‌క‌ముందు సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 12 ప‌రుగుల తేడాతో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే..

తొమ్మిది సార్లు ప‌ర్య‌టిస్తే..

ద‌క్షిణాఫ్రికాలో ఒక్క సారి కూడా భార‌త జ‌ట్టు టెస్టు సిరీస్‌ను గెల‌వ‌లేదు. తాజా ప‌ర్య‌ట‌న‌తో క‌లిపి ద‌క్షిణాఫ్రికాలో టీమ్ఇండియా తొమ్మిది సార్లు ప‌ర్య‌టించింది. ఇందులో ఏడు సార్లు ఓడిపోగా.. కేవ‌లం రెండు సంద‌ర్భాల్లో మాత్ర‌మే టెస్టు సిరీస్‌ను స‌మం చేసింది. 1992-93, 1996-97, 2001-02, 2006-07, 2013, 2018, 2021-22లో భారత్ టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. ధోనీ కెప్టెన్సీలో 2010-11లో 1-1తో, రోహిత్ సార‌థ్యంలో 2023-2024 ప‌ర్య‌ట‌న‌లో 1-1తో టెస్టు సిరీస్‌ల‌ను స‌మం చేసింది. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ద‌క్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ భార‌త్‌కు అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది. మ‌రీ దీన్ని ఏ కెప్టెన్ సాధిస్తాడో వేచి చూడాల్సిందే.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ కోసం 25 నుంచి 30 మంది ఆటగాళ్లతో షార్ట్ లిస్ట్..!

2 రోజుల్లోనే..

కేప్‌టౌన్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచు కేవ‌లం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ (15/6) దెబ్బ‌కు ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త్ 153 ప‌రుగులు చేసింది. దీంతో టీమ్ఇండియాకు కీల‌క‌మైన 98 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

ఆ త‌రువాత మార్‌క్ర‌మ్ (106)సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 176 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ ముందు 79 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. ఈ ల‌క్ష్యాన్ని భార‌త్ 12 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ 28, శుభ్‌మ‌న్ గిల్ 10, రోహిత్ శ‌ర్మ 17 నాటౌట్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ 4 నాటౌట్‌లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో నాంద్రే బర్గర్, క‌గిసో ర‌బాడ, మార్కో జాన్సెన్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

Sledging : ఈ యువ కెప్టెన్ మాట‌లు విన్నారా..? చిన్నోడే గానీ మ‌హాముదురు..!