Rohit Sharma : విన్నింగ్ ట్రోఫీని వద్దన్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్.. నెట్టింట ప్రశంసల జల్లు
ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మొదటి రెండు వన్డేల్లో గెలవడంతో సిరీస్ 2-1 తేడాతో భారత్ సొంతమైంది.

Ind vs Aus 3rd ODI
Rohit Sharma – KL Rahul : ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మొదటి రెండు వన్డేల్లో గెలవడంతో సిరీస్ 2-1 తేడాతో భారత్ సొంతమైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ శర్మపై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.
రోహిత్ ఏం చేశాడంటే..?
మూడు వన్డేల ఈ సిరీస్‌లో మొదటి రెండు వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి గైర్హజరీలో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు వహించాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ టీమ్ఇండియా విజయం సాధించింది. అంతేకాకుండా వ్యక్తిగతంగానూ బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. మూడో మ్యాచ్‌కు రోహిత్ రావడంతో యధావిధిగా హిట్‌మ్యానే సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు.
మూడో వన్డే పూర్తి అయిన తరువాత భారత జట్టు సిరీస్ గెలవడంతో విన్నింగ్ ట్రోఫీని అందుకోవాలని భారత కెప్టెన్ అయిన రోహిత్ శర్మను హర్షాబోగ్లే ఆహ్వానించాడు. అయితే.. హిట్‌మ్యాన్ మాత్రం తన మంచి మనసును చాటుకున్నాడు. మొదటి రెండు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించి సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌ను ట్రోఫీ అందుకోవాలని కోరాడు. రాహుల్ వచ్చి విన్నింగ్ ట్రోఫీని అందుకున్నాడు. అంతేనా ఫోటో దిగే సమయంలోనూ రోహిత్ శర్మ కేవలం ఓ ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు.
ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటీజన్లు రోహిత్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Also Read: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వరల్డ్‌కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్?
Captain @ImRo45 & @klrahul collect the @IDFCFIRSTBank Trophy as #TeamIndia win the ODI series 2⃣-1⃣ 👏👏#INDvAUS pic.twitter.com/k3JiTMiVGJ
— BCCI (@BCCI) September 27, 2023