కేఎల్ రాహుల్‌ను దారుణంగా ట్రోల్ చేసిన రోహిత్ శర్మ, సునీల్ శెట్టి.. వీడియో వైరల్
కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అల్లుడు. సునీల్ శెట్టి కూతురు, నటి అతియా శెట్టితో రాహుల్ కు గతేడాది వివాహం జరిగింది

Rohit Sharma
Rohit Sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సందడి మొదలైంది. క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీ రేపు సాయంత్రం ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు ముంబై ఇండియన్స్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ను ట్రోల్ చేశారు.
Also Read : IPL 2024 : ఐపీఎల్ ప్రారంభంలోనే లక్నో సూపర్ జెయింట్ జట్టుకు భారీ షాక్..
కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అల్లుడు. సునీల్ శెట్టి కూతురు, నటి అతియా శెట్టితో రాహుల్ కు గతేడాది వివాహం జరిగింది. రోహిత్ శర్మ షేర్ చేసిన వీడియోలో రోహిత్, సునీల్ శెట్టి ఇద్దరు కలిసి కేఎల్ రాహుల్ ను ట్రోల్ చేయడం వీడియోలో చూడొచ్చు. కేఎల్ రాహుల్ లోపలికి వచ్చినప్పుడు రోహిత్ శర్మ, సునీల్ శెట్టి తమ డిన్నర్ ను ఆస్వాదించడంతో వీడియో ప్రారంభమవుతుంది. రోహిత్, సునీల్ శెట్టి కూర్చున్న టేబుల్ వద్దకు కేఎల్ రాహుల్ వస్తాడు. వారివద్ద కూర్చునే ప్రయత్నం చేస్తాడు. దీంతో రోహిత్ కలుగజేసుకొని శెట్టికి, నాకు మధ్య ఇది కుటుంబ విందు అని చెబుతాడు.
Also Read : డేవిడ్ వార్నర్‌కు తెలుగు కుర్రాళ్లు ప్రత్యేక బహుమతి.. ఫిదా అయిన డీసీ బ్యాటర్.. వీడియో వైరల్
రాహుల్ నిస్సహాయంగా సునీల్ శెట్టివైపు చూస్తూ పప్పా అంటాడు.. సునీల్ శెట్టి స్పందిస్తూ.. రోహిత్ నా కొడుకు అని చెబుతూ సమాధానం ఇస్తాడు. కుటుంబ సమయం ముగిసింది.. పోటీ ప్రారంభమైంది అంటూ సునీల్ శెట్టి అనడంతో రాహుల్ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. సునీల్ శెట్టి రాహుల్ బేటా ఈ యాపిల్ ముక్క తిను అంటూ యాపిల్ ముక్కను స్పూన్ తో రోహిత్ నోటికి అందిస్తాడు. దీంతో రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోకు రోహిత్ శర్మ క్యాపన్షన్ లో కుటుంబ సమయం ముగిసింది.. ఆట ప్రారంభమైంది అంటూ రాశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Family time over @klrahul, ab rivalry time shuru ho gaya hai! ?@SunielVShetty ab hue humare ?
.
.#Ad #Dream11 #TeamSeBadaKuchNahi pic.twitter.com/B5lljX3adE— Rohit Sharma (@ImRo45) March 20, 2024