డేవిడ్ వార్న‌ర్‌కు తెలుగు కుర్రాళ్లు ప్రత్యేక బహుమతి.. ఫిదా అయిన డీసీ బ్యాటర్.. వీడియో వైరల్

డేవిడ్ వార్నర్ వైజాగ్ వచ్చిన సందర్భంగా తెలుగు కుర్రాళ్లు ప్రత్యేకమైన బహుమతిని అందజేశారు

డేవిడ్ వార్న‌ర్‌కు తెలుగు కుర్రాళ్లు ప్రత్యేక బహుమతి.. ఫిదా అయిన డీసీ బ్యాటర్.. వీడియో వైరల్

David Warner

Updated On : March 21, 2024 / 12:27 PM IST

IPL 2024 David Warner : ఐపీఎల్ – 2024 సందడి ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరగనుంది. 23న మొహాలీలో పంజాబ్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్టణంను తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ జట్టు తమ మొదటి భాగం హోమ్ మ్యాచ్ లను వైజాగ్ లో ఆడనుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులు విశాఖ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మంగళవారం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ఘన స్వాగతం లభించింది.

Also Read : రోహిత్, హార్దిక్ కలిసిపోయారు..! వాంఖెడే స్టేడియంలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

వైజాగ్ లో మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ ఈ మైదానంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 3న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో మరో మ్యాచ్ ఆడనుంది. డేవిడ్ వార్నర్ వైజాగ్ వచ్చిన సందర్భంగా తెలుగు కుర్రాళ్లు ప్రత్యేకమైన బహుమతిని అందజేశారు. జైశ్రీరాం కండువాను కప్పి, అయోధ్య దేవాలయం ప్రతిమను వార్నర్ కు అందజేశారు. దీంతో వార్నర్ సైతం తెలుగు కుర్రాళ్లు అందించిన బహుమతికి ఎంతో ఖుషీ అయ్యాడు. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : IPL 2024 : ఐపీఎల్ ప్రారంభంలోనే లక్నో సూపర్ జెయింట్‌ జట్టుకు భారీ షాక్..

అయోధ్య రామమందిరంలో రామలల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రామ భక్తిని చాటుకున్న విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ జై శ్రీరామ్ అంటూ భారతీయులందరికీ తన అభినందన సందేశాన్నితెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో శ్రీరామచంద్రుడి రాక ఫొటోను షేర్ చేశాడు. జై శ్రీరాం ఇండియా అని రాశారు. దీంతో డేవిడ్ వార్నర్ పోస్టుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.