స్టంప్ మైక్‌లో రోహిత్ మాట‌లు రికార్డు.. మైదానంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లను హిట్‌మ్యాన్‌ ఏమ‌న్నాడంటే ?

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ విధ్వంస‌క ఆట‌గాడు మాత్ర‌మే కాదు అత‌డిలోనూ ఓ మంచి ఎంట‌ర్‌టైన‌ర్ దాగి ఉన్నాడు.

స్టంప్ మైక్‌లో రోహిత్ మాట‌లు రికార్డు.. మైదానంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లను హిట్‌మ్యాన్‌ ఏమ‌న్నాడంటే ?

Rohit Sharma Meltdown In 2nd Test Caught On Stump Mic

Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ విధ్వంస‌క ఆట‌గాడు మాత్ర‌మే కాదు అత‌డిలోనూ ఓ మంచి ఎంట‌ర్‌టైన‌ర్ దాగి ఉన్నాడు. విలేక‌రుల స‌మావేశాల్లో అత‌డు జ‌ర్న‌లిస్టుల‌ను న‌వ్విస్తుండ‌డాన్ని చూస్తూనే ఉంటాం. ఇక మైదానంలో సైతం స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో రోహిత్ మాట్లాడే తీరుకు ఎవ్వ‌రైనా ఫిదా కావాల్సిందే. విశాఖ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో ఆట‌గాళ్ల‌తో రోహిత్ మాట్లాడిన కొన్ని మాట‌లు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలో రోహిత్.. ‘మేరే గ‌లే కా వాత్ లాగ్ గ‌యా చిల్లా చిల్లాకే తుమ్ స‌బ్ కో’ (మీ మీద అరిచి అరిచి నా గొంతు పోతుంది) అని రోహిత్ అన్నాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. మైదానంలో స‌హ‌చ‌రులో రోహిత్ ఉండే విధానానం దీని ద్వారా అర్థ‌మ‌వుతోందని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

విశాఖ టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఈ మ్యాచ్‌లో భార‌త్ 106 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా తొలుత బ్యాటింగ్ చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (209; 290 బంతుల్లో 19ఫోర్లు, 7సిక్స‌ర్లు) ద్విశ‌త‌కం బాద‌డంతో మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త్ 396 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా ఆరు వికెట్ల‌తో చెల‌రేగ‌డంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. దీంతో భార‌త్‌కు 143 ప‌రుగుల కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

NZ vs RSA : విజృంభించిన బౌల‌ర్లు.. ద‌క్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ రికార్డు విజ‌యం..

అనంత‌రం శుభ్‌మ‌న్ గిల్ (104; 147 బంతుల్లో 11 ఫోర్లు, 2సిక్స‌ర్లు) సెంచ‌రీ బాద‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ 255 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 399 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. అయితే.. ల‌క్ష్య ఛేద‌న‌లో ఇంగ్లాండ్ 292 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో భార‌త్ గెలుపొందింది. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది.

ప్ర‌శంస‌ల వ‌ర్షం..
ఈ మ్యాచ్ అనంత‌రం పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా తో పాటు స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తోనే ఈ గెలుపు సాధ్య‌మైంద‌న్నాడు. ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం అంత ఈజీ కాద‌నే విష‌యం తెలుస‌ని చెప్పాడు. బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. బౌల‌ర్లు రాణించాల‌ని కోరుకున్నా వారు అది చేసి చూపించారు. బుమ్రా ఓ ఛాపింయ‌న్ ఆట‌గాడు. నిమిషాల వ్య‌వ‌ధిలో మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేయ‌గ‌ల‌డ‌ని మెచ్చుకున్నాడు.

య‌శ‌స్వి జైస్వాల్ ఓ అద్భుత‌మైన బ్యాట‌ర్ అని కొనియాడాడు. అత‌డు ఆట‌ను చాలా బాగా అర్ధం చేసుకుంటాడ‌న్నారు. అత‌డు ఇంకా చాలా దూరం వెళ్లాల‌ని, జ‌ట్టు కోసం అత‌డు చేయాల్సింది ఎంతో ఉంద‌న్నాడు. అనుభ‌వ లేమీతో మంచి ఆరంభాల‌ను ల‌భించినా యువ ఆట‌గాళ్లు వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయార‌న్నాడు. టెస్టుల్లో కుదురుకోవ‌డానికి వారికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నాడు. ఇంకో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంద‌ని, అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి సిరీస్ గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పుకొచ్చాడు.

Also Read : నీటి ప్ర‌వాహ‌మే పిచ్‌.. కాలువ‌కు అటువైపు బ్యాట‌ర్‌.. ఇటు వైపు బౌల‌ర్‌.. ఇది నెక్ట్స్ లెవెల్ క్రికెట్‌