రోహిత్ శర్మకి ఆల్ రౌండర్ ఆమేనట

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లకు ముందు రోహిత్ చిన్నపాటి విరామం తీసుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంకతో టీ20లకు కూడా దూరమయ్యాడు. ఈ గ్యాప్‌లో భార్య రితికా సజ్దేశ్ తో కలిసి టూర్లకు చెక్కేశాడు. వెకేషన్ లో ఉన్న రోహిత్ తన భార్యతో ఉన్న ఫొటోను పెట్టి తనే నా ఆల్ రౌండర్ అంటూ క్యాప్షన్ పెట్టి పోస్టు చేశాడు.
రోహిత్ తో పాటు.. రితికా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇద్దరి చిట్ చాట్లతో ఫాన్స్‌ను భారీ సంఖ్యలోనే పోగు చేసుకున్నారు. కొందరైతే వీరిని రోహికా అంటూ పిలుస్తుంటారు కూడా. అంత లవ్ బర్డ్స్ వీళ్లిద్దరూ. ఇటీవల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను భార్యతో కలిసి జరుపుకున్న రోహిత్.. నా ఆల్ రౌండర్.. నా కోసం ఏమైనా చేయగలదు అని పోస్టు చేశాడు.
కొంతకాలం ప్రేమాయణం తర్వాత 2015 డిసెంబరు 31న ఒకటైన ఈ జంటకు 2018లో సమైరా పుట్టింది. చాలా సందర్భాల్లో రితికా.. రోహిత్ కోసం స్టేడియంకు వచ్చి జోష్ నింపే ప్రయత్నం చేస్తుంటుంది. పలు సందర్భాల్లో కెమెరాలు ఆమె హావభావాలను చిత్రించి పండగ చేసుకున్నాయి. ఇక రోహిత్.. జనవరి 14నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లకు అందుబాటులో ఉండనున్నాడు.
2019లో అత్యధిక స్కోరుచేసిన ప్లేయర్ గా ఘనత సాధించిన రోహిట్ శర్మ 2020ను ఎలా ఆరంభిస్తాడో చూడాలి మరి.