టీ20లకు విశ్రాంతి తీసుకోనున్న రోహిత్

న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత జట్టును ఫిబ్రవరి 15వ తేదీ లోపే సెలక్షన్ కమిటీ నిర్దారణ చేయాల్సి ఉంది. ముందుగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుండగా, ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు హిట్ మాన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్లు సమాచారం.
కొద్ది నెలలుగా విరామం లేకుండా జరుగుతున్న వరుస సిరీస్‌లతో టీమిండియా ప్లేయర్లు అలసిపోయారని వారికి విశ్రాంతి అవసరమని టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపింది. దీని కోసమే న్యూజిలాండ్‌తో ఆఖరి సిరీస్ అయిన టీ20కు, చివరి రెండు వన్డేలకు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమైయ్యాడు.
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20సిరీస్‌కు కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తిరిగి చేపట్టనుండగా రోహిత్ విశ్రాంతి తీసుకోనున్నాడట. ఈ మేరకే వన్డే సిరీస్‌లోనూ కొందరు ప్లేయర్లు విడతల వారీగా దూరంగా కానున్నారట. మార్చి 2 నుంచి మార్చి 13వరకూ ఢిల్లీ వేదికగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.
బుమ్రా, భువనేశ్వర్, షమీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారు. ఖలీల్ అహ్మద్ కూడా తోడైతే పని ఒత్తిడిని తగ్గించేందుకు రొటేషన్ పద్ధతిని వాడొచ్చని అధికారులు తెలిపారు.