Rohit Sharma: వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ?

టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా ఉండనని విరాట్ కోహ్లీ ప్రకటించాడు.

Rohit Sharma: వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ?

Rohith Sharma

Updated On : September 21, 2021 / 1:03 PM IST

Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా ఉండనని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ ప్రకటన తరువాత, కోహ్లీ భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఇప్పుడు ఐపిఎల్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాగా రాణిస్తే, అతడిని భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కూడా చేయవచ్చని భారత మాజీ క్రికెటర్ మాదల్ లాల్ అభిప్రాయపడ్డారు.

మాజీ క్రికెటర్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ టీ20 కెప్టెన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, మరొకరు ఈ రేసులోకి వచ్చే అవకాశం కూడా లేదని అన్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపిఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన రోహిత్ శర్మ.. కోహ్లీ స్థానం ఆక్రమించవచ్చునని అన్నారు. విరాట్ కోహ్లీకి కూడా ఒత్తిడి తగ్గి, బ్యాటింగ్‌లో రాణించే అవకాశం వస్తుందని అన్నారు. విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీకి ప్రస్తుతానికైతే, ఎలాంటి ముప్పు లేదని, కానీ టీ 20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తే, టీమ్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా కూడా చేయవలసిన పరిస్థితి వస్తుందని అన్నారు.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు భారత జట్టుకు వన్డేలు మరియు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటి నుంచి ఏ ఐసీసీ టైటిల్‌ను కూడా గెలవలేదు, బలమైన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కోహ్లీ.. కెప్టెన్ అయ్యాక బ్యాటింగ్‌లో ప్రభావం చూపలేకపోయారు. ఈ క్రమంలో రోహిత్ టీ20 కెప్టెన్ అయ్యాక.. టీ20లో అతని ప్రదర్శనపై ఆధారపడి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అతను 2022 టీ20 ప్రపంచ కప్‌లో బాగా రాణిస్తే మాత్రం కచ్చితంగా వన్డే కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది.