RR vs KKR : స‌మ ఉజ్జీల స‌మ‌రం.. గెలుపు బోణీ ఎవ‌రిదో..?

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది.

RR vs KKR : స‌మ ఉజ్జీల స‌మ‌రం.. గెలుపు బోణీ ఎవ‌రిదో..?

RR vs KKR head to head records predicted playing XI pitch report

Updated On : March 26, 2025 / 2:21 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ‌రో స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. నేడు (బుధ‌వారం మార్చి 26) గౌహ‌తి వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది. రాత్రి 7.30గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ రెండు జ‌ట్లు కూడా త‌మ తొలి మ్యాచ్‌లో ఓట‌మి పాలైయ్యాయి. ఈ క్ర‌మంలో నేటి మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో తొలి గెలుపును రుచి చూడాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి.

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో కేకేఆర్ జ‌ట్టు దెబ్బ‌తిన‌గా, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో రాజ‌స్థాన్ ఓడిపోయాయి. కేకేఆర్‌, రాజ‌స్థాన్ జ‌ట్లు తాము ఓడిన మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో బాగానే రాణించాయి. కానీ ఆయా జ‌ట్ల బౌలింగ్ కాస్త బ‌ల‌హీనంగా ఉండ‌డంతో మ్యాచ్‌ల‌ను కోల్పోయాయి.

హెడ్ టు హెడ్ రికార్డులు..

కేకేఆర్, రాజ‌స్థాన్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ముఖాముఖిగా 30 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో రాజ‌స్థాన్, మ‌రో 14 మ్యాచ్‌ల్లో కేకేఆర్ విజ‌యాన్ని సాధించాయి. మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ఫ‌లితం తేల‌లేదు.

Kavya Maran : కావ్యా మార‌న్‌ ఎన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వార‌సురాలో తెలుసా?

గౌహ‌తి పిచ్ రిపోర్ట్‌..

గౌహ‌తిలోని బ‌ర్స‌పారా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. స‌హ‌జంగా ఈ పిచ్ బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామం. ఇక్క‌డ జ‌రిగిన టీ20 మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ స‌గ‌టు స్కోరు 200 కి పైనే ఉంది. ఆరంభంలో పిచ్ పేస‌ర్ల‌కు కాస్త స‌హ‌కారాన్ని అందించ‌వ‌చ్చు. దీంతో ఈ మ్యాచ్‌లోరూ భారీ స్కోర్లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. గ‌తంలో ఇదే స్టేడియంలో కేకేఆర్‌, రాజ‌స్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది.

ఇక ఈ స్టేడియం మొత్తం నాలుగు ఐపీఎల్ మ్యాచ్ల‌కు ఆతిథ్యం ఇచ్చింది. వీటిలో తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్టు రెండు సార్లు గెల‌వ‌గా, ల‌క్ష్యాన్ని ఛేదిన దిగిన‌ జ‌ట్టు ఓ సారి విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్ ర‌ద్దైంది.

ర‌హానే, న‌రైన్ మిన‌హా..

కేకేఆర్ జ‌ట్టులో ఆ జ‌ట్టు కెప్టెన్ అజింక్యా ర‌హానే తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ బాది మంచి ట‌చ్‌లో ఉన్నాడు. ఓపెన‌ర్ సునీల్ న‌రైన్ రాణించాడు. అయితే.. కీల‌క ఆట‌గాళ్లు డికాక్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్, రింకూ సింగ్‌, ర‌సెల్‌లు మాత్రం నిరాశ‌ప‌రిచారు. ఆర్ఆర్ మ్యాచ్‌లో వీరంతా రాణిస్తే కోల్‌క‌తాకు తిరుగు ఉండ‌దు. ఇక బౌలింగ్‌లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి తేలిపోయాడు. హ‌ర్షిత్ రాణా, స్పెన్స‌ర్ జాన్స‌ర్‌, వైభ‌వ్ ఆరోరాలు స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంది.

Mohammed Siraj : రోహిత్ శ‌ర్మ‌కు అంతా తెలుసు.. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఎంపిక కాక‌పోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయాను.. సిరాజ్ కామెంట్స్ వైర‌ల్‌..

య‌శ్వ‌సి, రియాన్‌, నితీశ్‌లు రాణిస్తేనే..

సంజూ శాంస‌న్‌, ధ్రువ్ జురెల్‌, హెట్‌మైర్‌, శుభ‌మ్ దూబే మంచి ట‌చ్‌లో ఉన్నారు. వీరితో పాటు య‌శ‌స్వి జైస్వాల్‌, రియాన్ ప‌రాగ్‌, నితీశ్ రాణాలు రాణిస్తే ఆర్ఆర్ భారీ స్కోరును సాధించొచ్చు. ఇక ఇంగ్లాండ్ పేస‌ర్ జోఫ్రా ఆర్ఛ‌ర్ స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో ధారాళంగా ప‌రుగులు ఇచ్చాడు. 4 ఓవ‌ర్ల‌లో 76 ప‌రుగులు ఇచ్చాడు. ఇత‌డితో పాటు ఫజల్‌ హక్‌ ఫారూకీ, తీక్షణ, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే లు రాణిస్తే కేకేఆర్ కు క‌ష్టాలు త‌ప్ప‌వు.

రెండు జ‌ట్ల ప్లేయింగ్ ఎలెవ‌న్ అంచ‌నా..

కోల్‌కతా నైట్ రైడర్స్..
అజింక్య రహానే(కెప్టెన్‌), క్వింటన్ డికాక్(వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్/అన్రిచ్ నార్ట్జే.

GT vs PBKS : శ్రేయ‌స్ అయ్యర్ సెంచ‌రీకి ఎందుకు స‌హ‌క‌రించ‌లేదంటే.. అస‌లు నిజం చెప్పిన శ‌శాంక్ సింగ్..

రాజస్థాన్ రాయల్స్..
సంజూ శాంస‌న్, యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్‌ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హాక్ ఫరూఖీ.