Sachin Tendulkar Statue: సచిన్‌కు అరుదైన గౌరవం .. వాంఖడే స్టేడియంలో నిలువెత్తు విగ్రహం..

టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్‌ నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Sachin Tendulkar Statue: సచిన్‌కు అరుదైన గౌరవం .. వాంఖడే స్టేడియంలో నిలువెత్తు విగ్రహం..

Sachin Tendulkar Statue

Updated On : February 28, 2023 / 3:06 PM IST

Sachin Tendulkar Statue: క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండి పోయే కొద్దిమంది దిగ్గజ క్రికెటర్లలో సచిన్ టెండుల్కర్ ఒకరు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియాను అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో సచిన్ పాత్ర కీలకం అనడంలో అతిశయోక్తి లేదు. సచిన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలాకాలం అవుతున్నప్పటికీ క్రికెట్ అభిమానుల మనసుల్లో సచిన్ చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ కు అరుదైన గౌరవం దక్కింది. వాఖండే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాన్ని ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలే ప్రకటించారు. వన్డే ప్రపంచ కప్ -2023 మెగా టోర్నీ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

Sachin Tendulkar Double Ton: సచిన్ టెండూల్కర్ జీవితంలో మరో మరపురాని రోజు ఇది

ఎంసీఏ తీసుకున్న నిర్ణయంపై సచిన్ మాట్లాడారు. ఎంసీఏ తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. వాంఖడే స్టేడియంతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదని తెలిపారు. నా తొలి రంజీ మ్యాచ్‌ను ఇక్కడే ఆడానని, ఇక్కడే నా చివరి మ్యాచ్‌నుకూడా ఈ మైదానంలోనే ఆడానని సచిన్ తెలిపాడు. వాఖండే స్టేడియంలోకి వస్తే.. నా జీవితం నా కళ్లముందు కనిపిస్తుందని చెప్పారు.

Sachin Tendulkar: సచిన్.. సచిన్.. సచిన్.. విమానంలో హోరెత్తిన ఫ్యాన్స్ నినాదాలు.. ఎందుకంటే

ఇక్కడ నాకు చాలా అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని సచిన్ అన్నారు. నా జీవితంలో ఎంసీఏ తీసుకున్న నిర్ణయం పెద్ద సంఘటనగా నిలిచిపోతుందని, ఇప్పుడు నేను పాతికేళ్ల అనుభవంతో 25ఏళ్ల యువకుడిగా ఉన్నానని సచిన్ అన్నారు. ఈ సందర్భంగా ఎంసీఏకి సచిన్ టెండుల్కర్ ధన్యవాదాలు తెలిపారు.