RR vs CSK : ఇటు ధోనికి ఒకటి, అటు సంజు శాంసన్‌కి రెండు.. 350ని చేరుకునేది ఎవరు?
మంగళవారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. కాగా.. ఇప్పటికే చెన్నై, రాజస్థాన్‌లు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగానే మారింది. అయితే.. ఇరు జట్ల కెప్టెన్లు మాత్రం ఓ అరుదైన మైలురాయి పై కన్నేశారు.
నేటి మ్యాచ్‌లో ధోని గనుక ఓ సిక్స్ కొడితే టీ20ల్లో 350 సిక్సర్లు మైలురాయిని చేరుకుంటాడు. అటు సంజూశాంసన్ రెండు సిక్సర్లు బాదితే ఈ మైలురాయిని అందుకుంటాడు. వీరిలో ఎవరు 350 సిక్సర్ల మైలురాయిని అందుకుంటారో చూడాల్సిందే. ఇప్పటి వరకు టీ20ల్లో 33 మంది క్రికెటర్లు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.
LSG : ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్.. ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్..
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లను బాదాడు. ఆ తరువాతి స్థానాల్లో పొలార్డ్, ఆండ్రీ రసెల్, నికోలస్ పూరన్, అలెక్స్ హేల్స్ తదితరులు ఉన్నారు.
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
* క్రిస్ గేల్ – 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు
* కీరన్ పోలార్డ్ – 695 మ్యాచ్‌ల్లో 908 సిక్సర్లు
* ఆండ్రీ రసెల్ – 550 మ్యాచ్‌ల్లో 747 సిక్సర్లు
* నికోలస్ పూరన్ – 396 మ్యాచ్‌ల్లో 634 సిక్సర్లు
* అలెక్స్ హేల్స్ – 495 మ్యాచ్‌ల్లో 560 సిక్సర్లు
* కొలిన్ మున్రో – 441 మ్యాచ్‌ల్లో 557 సిక్సర్లు
* రోహిత్ శర్మ – 459 మ్యాచ్‌ల్లో 542 సిక్సర్లు
* జోస్ బట్లర్ – 446 మ్యాచ్‌ల్లో 537 సిక్సర్లు
* గ్లెన్ మాక్స్‌వెల్ – 466 మ్యాచ్‌ల్లో 530 సిక్సర్లు
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ధోని 11 మ్యాచ్‌ల్లో 25.71 సగటు 140.62 స్ట్రైక్‌రేటుతో 180 పరుగులు చేశాడు.