క్రికెట్‌లో నయా ట్రెండ్: పంచెకట్టుతో బ్యాటింగ్, సంస్కృతంలో కామెంట్రీ

క్రికెట్‌లో నయా ట్రెండ్: పంచెకట్టుతో బ్యాటింగ్, సంస్కృతంలో కామెంట్రీ

Updated On : February 14, 2019 / 6:48 AM IST

ట్రెండ్‌కు తగ్గట్టుగా క్రికెట్‌లోనూ ట్రెండ్‌లు మారుతూనే ఉన్నాయి. కాయిన్ బదులు బ్యాట్‌తో టాస్ వేసే విధానం, స్టంప్‌లకు మైక్‌లు పెట్టడం, స్టంప్‌లను ఎల్‌ఈడీలతో సిద్ధం చేయడం ఇవన్నీ చూశాం. కానీ, పంచె కట్టుతో క్రికెట్ ఆడటం చూశారా.. మైదానంలో ప్రతి ఒక్కరూ అంపైర్‌తో సహా పంచె కట్టులో కనిపించడం వింతగానే ఉన్నా.. వారు ఆడిన లీగ్‌ పేరుకు సరిగ్గా సరిపోయింది. 

ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వారణాశిలో సంస్కృత విశ్వ విద్యాలయం స్థాపించి 75ఏళ్లు కావస్తుండటంతో సంపూర్ణానంద్ సాంస్క్రీట్ విద్యాలయ వారు ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్లు నుదుటి మీద శివలింగం, మూడు అడ్డం బొట్లతో కనిపించారు. పైగా ఇలాంటి వేషాధారణలో కనిపించి అది క్రికెట్ ఆడటానికి ఓ ప్రేరణలా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇలా చేశామని ఆ యూనివర్సిటీ ఉపాధ్యాయుడు ఒకరు తెలిపారు. 

మామూలు రోజుల్లో పెన్ను, పేర్లు పట్టుకుని వేదాలు వల్లించే విద్యార్థులు సంస్కృత క్రికెట్ లీగ్‌లో బ్యాట్, బాల్‌తో కనిపించారని అన్నారు. వారణాసిలోని అన్నీ సంస్కృత పాఠశాలలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనున్నాయట. మొత్తం ఐదు టీంలు ఆడనుండగా కామెంట్రీ కూడా సంస్కృతంలోనే వినిపిస్తారట.