Sarah Tendulkar: పొరపాటున ఆ పేరే రాసేస్తున్నా.. సారా టెండూల్కర్ “బై మిస్టేక్” పోస్ట్ వైరల్

Sarah Tendulkar Hilarious Post: సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ ఫ్రాంచైజీ గురించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన హిలేరియస్ పోస్ట్ వైరల్ గా మారింది.

Sarah Tendulkar: పొరపాటున ఆ పేరే రాసేస్తున్నా.. సారా టెండూల్కర్ “బై మిస్టేక్” పోస్ట్ వైరల్

Sarah Tendulkar Hilarious Post: సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ ఫ్రాంచైజీ గురించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన హిలేరియస్ పోస్ట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఐపీఎల్ జట్లలో ఆర్సీబీ కూడా ఒకటి. ఈ టీమ్ గురించి ఎటువంటి పోస్ట్ పెట్టినా అభిమానులు వెంటనే స్పందింస్తుంటారు. తాజాగా ఆర్సీబీ గురించి సారా టెండూల్కర్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.

పొరపాటున RBCకి బదులుగా RCB అని రాస్తూనే ఉన్నాను అంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సారా టెండూల్కర్.. ఒక ఫొటో షేర్ చేశారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్)లో ఆమె మెడిసిన్ చవిదిన సంగతి తెలిసిందే. వైద్య విద్యలో ఎర్ర రక్త కణాలు(Red Blood Cell) గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. బహుశా ఇదే నేపథ్యంలో RBC బదులుగా అని రాస్తున్నట్టుగా సారా టెండూల్కర్ ప్రస్తావించి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే సారా తండ్రి, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. ఐపీఎల్ లో ఒక్కసారి కూడా RCB తరఫున ఆడలేదు. ఐపీఎల్ ఆడినంత కాలం ఆయన ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. సారా తమ్ముడు అర్జున్ కూడా ముంబై టీమ్ తరఫునే ఆడుతున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ముంబై జట్టును ఉత్సాహపరుస్తూ సారా కనిపించిన సంగతి తెలిసిందే. అలాంటి సారా RCBని మర్చిపోలేకపోతున్నానంటూ వ్యాఖ్యానించడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ లో మూడుసార్లు ఫైనల్ చేరినప్పటికీ ఇప్పటివరకు RCB టైటిల్ గెలవలేకపోయింది. 2011 ఐపీఎల్ ఫైనల్లో ముంబై జట్టుతో RCB తలపడి ఓడిపోయింది. తాజా సీజన్ లో డుప్లెసిస్ కెప్టెన్సీలో RCB బరిలోకి దిగబోతోంది. ఈసారైనా టైటిల్ నెగ్గాలని RCB అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.