రనౌట్ ఇలా కూడా చేస్తారా: బాల్‌తో కొట్టాల్సింది కాలుతో..

ఎలాగైనా అవుట్ చేసేయాలని భావించిన బౌలర్.. స్టంపౌట్‌ను బంతితో కొట్టాల్సింది పోయి కాలితో తన్నేశాడు. ఈ సరదా సన్నివేశం డర్బన్ వేదికగా జరుగుతోన్న శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్‌లో చోటు చేసుకుంది. అప్పటికీ బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 38/1 స్కోరుతో ఉంది. బౌలింగ్ వేస్తున్న సౌతాఫ్రికా బౌలర్ ఎల్గర్ తడబాటు వికెట్ దక్కకుండా చేసింది. బంతి అందుకున్న వెంటనే వికెట్లను కాలితో తన్నేసి అవుట్ చేసినట్లు నటించాడు.
రిప్లైలో అతని ఆటంతా.. బయటపడటంతో స్టేడియంలో ఉన్నవాళ్లంతా ఎల్గర్‌ను చూసి నవ్వుకున్నారు. తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేస్తున్న ఎల్గర్.. ఓవర్లో ఐదో బంతిని దిముత్ కరుణరత్నె లెగ్ సైడ్ దిశగా బాదాడు. సింగిల్ కోసం ప్రయత్నించి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఫెర్నాండోని పిలిచాడు. అప్పటికే ఫీల్డర్ స్టెయిన్ బంతిని అందుకుని విసిరాడు.
పరుగు మొదలుపెట్టిన ఇద్దరూ వెనక్కి తిరిగారు. ఆ బంతిని ఫెర్నాండో వైపుకు విసరడంతో ఎల్గర్ పట్టుకునే ప్రయత్నం చేసి అది అందకపోవడంతో బంతితో రనౌట్ చేసినట్లుగా నటించాడు. రిప్లేలో కాలుతో తన్నడంతో బెయిల్స్ పడిపోయినట్లు క్లియర్‌గా కనిపించాయి. అతని నటన చూసి అందరూ నవ్వుకున్నారు.