Virat Kohli : విరాట్ కోహ్లి భ‌ద్ర‌త‌కు ముప్పు.. ఆర్‌సీబీ ప్రాక్టీస్ సెష‌న్ ర‌ద్దు..!

బెంగ‌ళూరు స్టార్ విరాట్ కోహ్లి భ‌ద్ర‌త‌కు ముప్పు పొంచి ఉంది.

Virat Kohli : విరాట్ కోహ్లి భ‌ద్ర‌త‌కు ముప్పు.. ఆర్‌సీబీ ప్రాక్టీస్ సెష‌న్ ర‌ద్దు..!

pic credit : IPL

ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో బుధ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ కీల‌క మ్యాచ్‌ కు ముందు ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బెంగ‌ళూరు స్టార్ విరాట్ కోహ్లి భ‌ద్ర‌త‌కు ముప్పు పొంచి ఉంది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు జ‌ట్టు త‌మ ప్రాక్టీస్ ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అహ్మ‌దాబాద్‌లో సోమ‌వారం రాత్రి న‌లుగురు అనుమానిత ఉగ్ర‌వాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, కొన్ని వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ జ‌ట్ల‌కు స‌మాచారం ఇచ్చార‌ని, ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లి భ‌ద్ర‌త‌కు ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో బెంగ‌ళూరు మంగ‌ళ‌వారం త‌మ ప్రాక్టీస్ సెష‌న్‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు స్థానిక మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. రెండు జ‌ట్లు కూడా నిన్న మీడియా స‌మావేశంలోనూ పాల్గొన‌లేదు.

Kavya Maran : ఒంటరిగా కావ్యాపాప.. ముఖంలో చిరున‌వ్వు మాయం.. త‌న‌కోసమ‌న్నా ఆడండ‌య్యా..!

‘విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత అరెస్టుల గురించి తెలుసుకున్నాడు. అతను జాతీయ సంపద, అతని భద్రత మా అత్యంత ప్రాధాన్యత ‘అని పోలీసు అధికారి విజయ్ సింఘా జ్వాలా చెప్పారు. ఈ క్ర‌మంలో ఆర్‌సీబీ సైతం ఎలాంటి రిస్క్ తీసుకోద‌లుచుకోలేద‌ని, ప్రాక్టీస్ సెష‌న్‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు తెలియ‌జేసిన‌ట్లు తెలిపారు. మ‌రోవైపు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మాత్రం య‌థావిధిగా ప్రాక్టీస్‌ను కొన‌సాగించింద‌న్నారు.

ఆర్సీబీ ఆటగాళ్లు బ‌స చేస్తున్న హోట‌ల్ వ‌ద్ద సెక్యూరిటీని రెట్టింపు చేశారు. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ల కోసం ప్ర‌త్యేక ఎంట్రీని ఏర్పాటు చేశారు. ఐపీఎల్ అనుబంధ మీడియా సిబ్బందిని సైతం లోనికి అనుమ‌తించ‌డం లేదు. మ‌రోవైపు మంగ‌ళ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్రాక్టీస్ కోసం మైదానానికి వెళ్లే స‌మ‌యంలో గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు.

Sania Mirza : ఇంటి నేమ్‌ప్లేట్‌ను మార్చేసిన మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. కొత్త నేమ్‌ప్లేట్‌లో ఎవ‌రి పేరుందంటే?

ఇదిలా ఉంటే.. నేటి మ్యాచ్ య‌థావిధిగా జ‌ర‌గ‌నుంది. ఎలిమినేట‌ర్‌లో గెలిచిన వారు క్వాలిఫ‌య‌ర్ -2లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నున్నారు. క్వాలిఫ‌య‌ర్‌-2కు చెన్నైలోని చెపాక్ మైదానం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. క్వాలిఫ‌య‌ర్‌-2లో విజ‌యం సాధించిన జ‌ట్టు ఫైన‌ల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఢీ కొట్ట‌నుంది.