South Africa vs India: బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ నేడే.. ఫైనల్ జట్టులో ఉండేదెవరు?
బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్న టీమ్ ఇండియా ఇవాళ(26 డిసెంబర్ 2021) మొదటి మ్యాచ్ ఆడబోతుంది.

Match
South Africa vs India: బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్న టీమ్ ఇండియా ఇవాళ(26 డిసెంబర్ 2021) మొదటి మ్యాచ్ ఆడబోతుంది. మూడేళ్ల కిందట దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. అయితే, ఆరు వన్డేల సిరీస్‌ను 5-1 తేడాతో, మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. గత టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది.
2015 సీజన్ నుంచి ఇరు దేశాల మధ్య జరిగే సిరీస్‌లను గాంధీ-మండేలా సిరీస్‌లుగా పిలుస్తున్నారు. అటు అంతర్జాతీయ క్రికెట్‌లోకి దక్షిణాఫ్రికా పునరాగమనానికి 30 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో భారత్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. జాతి వివక్ష కారణంతో దక్షిణాఫ్రికా మీద ఐసీసీ నిషేధం విధించింది. 1992లో నిషేధం పూర్తికావడం.. అప్పుడు తొలి పర్యటన టీమ్ఇండియానే చేసింది.
ఇరు దేశాల మైత్రికి చిహ్నంగా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలను భారత్ ఆడనుంది. నాలుగో వేవ్, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ పర్యటనపై కాస్త సందిగ్ధత ఏర్పడింది. అయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి పూర్తిస్థాయి భరోసా లభించడంతో టీమ్ఇండియా పర్యటన ఖరారైంది. కాకపోతే డిసెంబర్ 17 నుంచి ప్రారంభమవ్వాల్సిన తొలి టెస్టు మ్యాచ్ నేడు మొదలవుతుంది. తొలుత టీ20 సిరీస్‌ను కూడా ఖరారు చేసిన ఇరు బోర్డులు.. ప్రస్తుతానికి దానిని హోల్డ్‌లో పెట్టాయి
ఈ మ్యాచ్‌లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉండగా.. అందులోనూ నలుగురు ఫాస్ట్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, షమీ, బుమ్రా, సిరాజ్‌లు జట్టులో ఉండవచ్చని తెలుస్తోంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వచ్చే అవకాశం ఉండగా.. స్పిన్నర్‌గా అశ్విన్ దిగవచ్చు. మిడిలార్డర్‌లో కోహ్లీ వచ్చే అవకాశం ఉండగా.. పుజారా, రహానె, శ్రేయస్ అయ్యర్‌లో ఇద్దరికి తుది జట్టులో చోటు ఉండగా.. ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరం.