Shafali Verma: ఇంటర్ పాసైన టీమ్ఇండియా ఓపెనర్.. బ్యాటింగ్‌లోనే కాదు చదువులోనూ టాప్
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ క్రికెట్‌లోనే కాదు చదువులోనూ తాను టాప్ అని నిరూపించుకుంది. ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసైంది.

Shafali Verma Passes Class 12
Shafali Verma Passes Class 12: టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma ) మైదానంలోకి దిగితే పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ భారత జట్టుకు శుభారంభాలను ఇస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ క్రీడాకారిణిగా ఎదిగింది. షపాలీ క్రికెట్‌లోనే కాదు చదువులోనూ తాను టాప్ అని నిరూపించుకుంది. ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసైంది.
సీబీఎస్ఈ బోర్డ్ నిర్వహించిన పరీక్షల్లో 80+ స్కోర్ సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన మార్క్ షీట్‌ను పట్టుకుని దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ’80+స్కోర్ సాధించాను. అయితే అది క్రికెట్‌లో కాదు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో.. మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఏదీ ఏమైనప్పటికీ నాకు ఇష్టమైన సబెక్టు మాత్రం క్రికెట్.’ అంటూ ఆ ఫోటో కింద రాసుకొచ్చింది.
Virat Kohli: జైస్వాల్‌ను ప్రశంసిస్తూ కోహ్లి పోస్ట్.. కాసేపటికే డిలీట్.. అసలు సంగతి ఇదే..?
View this post on Instagram
15 ఏళ్ల వయస్సులోనే షపాలీ వర్మ భారత మహిళల క్రికెట్ జట్టులో అడుగుపెట్టింది. 2019లో దక్షిణాఫ్రికా పై మ్యాచ్ ఆడి అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసింది. ఇప్పటి వరకు భారత జట్టు తరుపున మొత్తం 79 మ్యాచ్‌లు ఆడింది. 2016 పరుగులు చేసింది.
షఫాలీ నాయకత్వంలో ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకుంది. తద్వారా టీమ్ఇండియాకు ఈ విభాగంలో తొలి ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కింది. ఇటీవల నిర్వహించిన మహిళల ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించింది షపాలీ. లీగ్‌లో పరుగుల వరద పారించి తన జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర వహించింది. మొత్తం 9 9 మ్యాచ్‌ల్లో 185.29 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేసింది.