ICC Trophy: కోహ్లీ, రవిశాస్త్రిలకు ఐసీసీ ట్రోఫీలు రాకుండా అడ్డుకున్న రెండు జట్లు ఇవే!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు నమీబియాపై విజయంతో టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది.

ICC Trophy: కోహ్లీ, రవిశాస్త్రిలకు ఐసీసీ ట్రోఫీలు రాకుండా అడ్డుకున్న రెండు జట్లు ఇవే!

Kohli

Updated On : November 9, 2021 / 9:09 AM IST

Shastri-Kohli partnership ends: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు నమీబియాపై విజయంతో టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. నమీబియాపై టీమిండియా 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 టోర్నీ. ఇకపై భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ వహించనని ఇప్పటికే కోహ్లీ చెప్పేశాడు. ఈ టోర్నీ తర్వాత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం కూడా ముగుస్తుంది. ఐసీసీ టోర్నీలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక్క విజయం కూడా లేకపోవడం గమనార్హం.

కోచ్‌గా శాస్త్రి టీమ్ ఇండియాకు ICC టోర్నమెంట్‌లలో ఒక్కసారి కూడా కప్ తీసుకుని రాలేకపోయాడు. జట్టుకు వీడ్కోలు చెబుతున్న సమయంతో లోటు ఇదేనని శాస్త్రి కూడా అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో టెస్టు మ్యాచ్‌లను గెలిపించిన కోచ్‌గా ఉన్నప్పటికీ.. తన హయాంలో భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించలేదు.

టీమ్ ఇండియాను ఐసీసీ ట్రోఫీ గెలవకుండా చేసిన రెండు జట్లు ఇవే:
ఇప్పటివరకు కెప్టెన్ కోహ్లి, కోచ్ శాస్త్రి ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడానికి కేవలం రెండు జట్లు మాత్రమే అడ్డుగా నిలబడ్డాయి. ఐసీసీ టోర్నీలో విజయం సాధించాలన్న ఈ జోడీ ఆశలను పాకిస్థాన్, న్యూజిలాండ్‌లే ఆవిరి చేశాయి. కోహ్లీ సారథ్యంలో 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌ను ఓడించి పాకిస్థాన్ టైటిల్ గెలుచుకోగా, కోహ్లికి విజయం దక్కలేదు.

దీని తర్వాత, 2019 సంవత్సరంలో, కోచ్ శాస్త్రితో కలిసి పనిచేసిన కోహ్లీ వన్డే ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. టోర్నమెంట్ గెలవడానికి రెండు అడుగుల దూరంలో, న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించింది. రెండు రోజులు జరిగిన మ్యాచ్‌లో భారత్‌ కివీస్‌ చేతిలో ఓడిపోయింది.

2021లో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కోహ్లి, కోచ్ శాస్త్రి జోడీ ఇక్కడ గెలుస్తుందని అందరూ భావించినా న్యూజిలాండ్ చేతిలో మరోసారి ఓడిపోయింది. కోహ్లీ సేనపై కివీస్ జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు జరుగుతున్న 2021 T20 ప్రపంచ కప్‌లో కూడా మొదటి రౌండ్‌లోనే, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లే భారత్‌ను ఓడించాయి. ఈ రెండు జట్లలో ఒక్క జట్టుపై గెలిచినా కూడా టీమిండియాకి టోర్నీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు.

Read More:

Pollution: Be Careful.. తీవ్రంగా వాయు కాలుష్యం.. వారు బయటకు రావొద్దు

CM Jagan: శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్

Covaxin: ఇండియన్ ట్రావెలర్స్‌కి గుడ్ న్యూస్.. బ్రిటన్‌లో కొవాగ్జిన్‌కి ఆమోదం