పాక్ బౌలర్ గ్రేట్ అంటోన్న శిఖర్ ధావన్

పాక్ బౌలర్ గ్రేట్ అంటోన్న శిఖర్ ధావన్

దేశమంతా క్రికెట్ ఫీవర్‍‌తో బిజీ అయిపోయింది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల అనంతరం భారత క్రికెటర్లంతా ఐపీఎల్‌లో బిజీ అయిపోనున్నారు. మార్చి 23 నుంచి జరగనున్న ఐపీఎల్ 2019కి 8 ఫ్రాంచైజీలు ఇప్పటికే హడావుడి మొదలుపెట్టేశాయి. కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన శిఖర్ ధావన్.. 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ సొంతగూటికే చేరుకున్నాడు. 
Also Read : అదేంటి: జార్ఖండ్‌కు పరాయివాడ్ని చేయొద్దంటోన్న ధోనీ

ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ధావన్‌ను తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. దాంతో పాటు గబ్బర్‌తో ఇంటర్వ్యూ చేసిన వీడియోను పోస్టు చేసింది. అందులో గబ్బర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

‘పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్.. నా ఫేవరేట్ క్రికెటర్. అతని ఆటంటే నాకు అమితమైన ఇష్టం’ అని తెలిపాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్ ల గురించి అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని తోసి పుచ్చాడు. ఇంకా కెరీర్‌లో తాను ఏ బౌలర్ కు భయపడ్డాడని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘మ్యాచ్ జరిగిన రోజును బట్టి సమాధానం ఉంటుంది’ అని కొట్టిపడేశాడు. 

Also Read : ధోనీ గిఫ్ట్ కోసం టీమిండియా కసరత్తులు, సిక్సుల చాలెంజ్