India vs Pakistan: భారత్ – పాక్ మ్యాచ్ కు ముందు సచిన్ ఫొటో షేర్ చేసిన అక్తర్.. మండిపడుతున్న నెటిజన్లు

భారత్ - పాక్ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

India vs Pakistan: భారత్ – పాక్ మ్యాచ్ కు ముందు సచిన్ ఫొటో షేర్ చేసిన అక్తర్.. మండిపడుతున్న నెటిజన్లు

Shoaib Akhtar and Sachin Tendulkar (Google Image)

Updated On : October 14, 2023 / 12:07 PM IST

ODI World Cup 2023 India vs Pakistan : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే పురుషుల వరల్డ్ కప్ టోర్నీలో అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో దాయాది జట్లయిన భారత్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్ లోని ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ హైవోల్టేజీ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. భారత్ – పాక్ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Read Also : ODI World Cup 2023 IND Vs PAK : హైవోల్టేజ్ మ్యాచ్.. పాక్ జట్టు ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా.. భారత్ జట్టు బలం వాళ్లే..

పాకిస్థాన్ క్రికెట్ జట్టు దిగ్గజం షోయబ్ అక్తర్ బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ను ఔట్ చేస్తున్న ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. కోల్ కతా వేదికగా భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఆసియా టెస్ట్ ఛాంపియన్ షిప్ తొలి మ్యాచ్ కు సంబంధించిన ఫొటో ఇది. ఈ మ్యాచ్ లో అక్తర్ తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read Also : Anushka Sharma : విరాట్ కోహ్లీకి మద్ధతుగా అహ్మదాబాద్ చేరుకున్న అనుష్కశర్మ

సోయబ్ అక్తర్ ఈ ట్వీట్ ను శుక్రవారం రాత్రి షేర్ చేశాడు. ఈ ట్వీట్ కు ‘రేపు ఇలాంటివి చేయాల్సి వస్తే..’ అంటూ రాశారు. దీంతో సోషల్ మీడియాలో అక్తర్ ను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 50ఓవర్ల ప్రపంచ కప్ మ్యాచ్ లో భారత్ ఇప్పటి వరకు పాక్ పై ఓడిపోలేదని గుర్తు చేశారు. మరికొందరు కోహ్లీ సెంచరీ చేసిన ఫొటోలను షేర్ చేస్తూ అక్తర్ ను ట్రోల్ చేస్తున్నారు.