కాస్కోండి తిరిగొస్తున్నా: మళ్లీ మైదానంలోకి రావల్పిండి ఎక్స్‌ప్రెస్

కాస్కోండి తిరిగొస్తున్నా: మళ్లీ మైదానంలోకి రావల్పిండి ఎక్స్‌ప్రెస్

రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్న విషయం ఖరారుచేశాడు. ఫిబ్రవరి 14న మళ్లీ తన క్రికెట్ ఆడేందుకు మైదానంలో దిగుతున్నట్లు ప్రకటించాడు. ‘ఈ రోజుల్లో పిల్లలంతా క్రికెట్ గురించి చాలా తెలుసన్నట్లు ఫీలవుతున్నారు. వారికి ఛాలెంజ్ విసురుతున్నా. నా స్పీడ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ వీడియో మెసేజ్‌లో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ వీడియోను పోస్ట్ చేశారు. 

ఇంకా ఆ మాటల్లో ఫిబ్రవరి 14న నేను రాబోతున్నా.. గుర్తు పెట్టుకోండి మీ క్యాలెండర్‌లో ఆ డేట్ రాసి పెట్టుకోండి. లీగ్ మ్యాచ్ ఆడేందుకు నేనొస్తున్నా. ఈ పిల్లలకు కూడా తెలియాలి కదా వేగమంటే ఏంటో’అని అన్నాడు. 

సరిగ్గా వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14)నే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ఆరంభమవుతుండటం విశేషం. లీగ్‌లో ఆడనున్న ఆరు జట్లలో ఓ జట్టు తరపున షోయబ్ అక్తర్ బరిలోకి దిగనున్నాడు. ఈ పోస్టును వసీం అక్రమ్, షోయబ్ మాలిక్‌లు షేర్ చేసి తన సంతోషాన్ని తెలియజేశారు. 

వసీం అక్రమ్.. ‘షైబీ.. ఇది నిజమా..? నువ్వు తిరిగొస్తున్నావా? ఈ రోజుల్లో పిల్లలు నీ వేగం తట్టుకోగలరా.’ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. 

 

 

షోయబ్ మాలిక్ ట్వీట్ చేస్తూ.. చాలా కాలమైపోయింది షోయబ్ భాయ్.. వచ్చి నీ వేగాన్ని మాకు చూపించు. లెజెండ్ ఆటను చూసేందుకు వెయిట్ చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు.