GT vs PBKS: సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డ శ్రేయాస్.. ఏం లాభం.. ప్చ్.. సెంచరీ మిస్
దీంతో 20 ఓవర్లలో పంజాబ్ స్కోరు 243-5గా నమోదైంది.

PIC Credit: IPL X
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మ్యాచులో అతడు సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 9 సిక్సులు, 5 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తం 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 20 ఓవర్లు అయిపోవడంతో మరో 3 పరుగులు చేసుకుని, సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం లేకుండాపోయింది.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాంష్ ఆర్యా 47, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 5, అహ్మతుల్లా 16, గ్లాన్ మ్యాక్స్‌వెల్ 0, స్టోయినిస్ 20, శశాంక్ సింగ్ 44 (నాటౌట్) పరుగులు తీశారు. దీంతో 20 ఓవర్లలో పంజాబ్ స్కోరు 243-5గా నమోదైంది. గుజరాత్ బౌలర్లలో రవిశ్రీనివాస్ సాయి కిశోర్ 3, రషీద్ ఖాన్, రబాడా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
పంజాబ్ కింగ్స్ జట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ