GT VS PBKS: ఈ గ్రౌండ్‌లో భారీ లక్ష్యాలను ఛేదించవచ్చు.. కాకపోతే ఈ మైదానంలో..: శుభ్‌మన్‌ గిల్‌ 

తమ జట్టులో బ్యాలెన్స్డ్‌ బౌలింగ్ యూనిట్ ఉందని చెప్పారు.

GT VS PBKS: ఈ గ్రౌండ్‌లో భారీ లక్ష్యాలను ఛేదించవచ్చు.. కాకపోతే ఈ మైదానంలో..: శుభ్‌మన్‌ గిల్‌ 

PIC: © IPL X

Updated On : March 25, 2025 / 7:54 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ మొదట బౌలింగ్ ఎంచుకుంది.

ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ… “మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. బ్యాటర్లు, బౌలర్లకు అనువుగా ఉండే పిచ్‌ ఇది. కొంత మంచు బిందువులు పడుతున్నాయి. దానిని దృష్టిలో ఉంచుకుంటే ఇదే ఇక్కడి పెద్ద అంశం. భారీ లక్ష్యాలను కూడా ఈ మైదానంలో ఛేదించవచ్చు. బాగా సాధన చేశాం. బ్యాలెన్స్డ్‌ బౌలింగ్ యూనిట్ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో ఆడటం చాలా అదృష్టంతో కూడుకున్న విషయం. మా జట్టులో నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.

శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. “టాస్‌ గెలిస్తే నేను బౌలింగ్ తీసుకునేవాడిని. నేను ఎప్పుడూ ఛేజింగ్‌ను ఇష్టపడతాను. సవాలును స్వీకరించాలి. నా చుట్టూ చాలా మంది తెలిసిన వారే ఉన్నారు.. రికీ కూడా ఉన్నారు. జట్టులో ఐక్యత అవసరం. మా జట్టులో చాలా మంది ఆల్ రౌండర్లు ఉన్నారు. మేము ముందుగా బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి, మా జట్టులో ఒకే స్పిన్నర్, ముగ్గురు సీమర్లు ఉన్నారు” అని అన్నాడు.

Also Read: ఇంకా ఆ పాత ఫోన్లను ఏం వాడతారు? మార్కెట్లో అతి తక్కువ ధరకు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఇవి కొనుక్కోండి..  

పంజాబ్ కింగ్స్ జట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: నేహాల్ వధేరా, ప్రవీణ్ దూబే, వైషాక్ విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్

గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, ఇషాంత్ శర్మ, అనుజ్ రావత్, వాషింగ్టన్ సుందర్