Shubman Gill : గిల్ బాబు.. అండర్సన్‌ను గల్లీ బౌలర్ అనుకున్నావా ఏంటీ..? ఆ కొట్టుడు ఏందీ? బెన్‌స్టోక్స్ ప్రశంసలు
టీమ్ఇండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

Shubman Gill smashes James Anderson over his head for step-out six
Shubman Gill : టీమ్ఇండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో అతడికి ఇది నాలుగో అర్థశతకం కావడం విశేషం. కాగా.. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికి గిల్ ఓ అద్భుతమైన షాట్ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తొలి రోజు ఆటలో స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్న గిల్.. రెండో రోజు పేసర్లపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో 34వ ఓవర్‌ను ఇంగ్లాండ్ వెటరన్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని గుడ్ లెంగ్త్ గా వేయగా.. ఫ్రంట్ పుట్‌కు వచ్చిన గిల్.. అండర్సన్ తలపై నుంచి భారీ సిక్స్‌గా మలిచాడు. బంతి ఎక్కడ పిచ్ అవుతుందో ముందే ఊహించిన గిల్.. బాల్ చూడకుండే షాట్ ఆడాడు. దీన్ని చూసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్.. గిల్ షాట్‌ను ప్రశంసించాడు.
Sachin Tendulkar : బిగ్‌బాస్ విన్నర్ చేతిలో ఔటైన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే.. అండర్సన్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సార్లు గిల్‌ను ఔట్ చేశాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు సార్లు గిల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు.. ఇప్పటికే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేశారు. 50 ఓవర్లకు భారత స్కోరు 230/1. గిల్ (80), రోహిత్ శర్మ (89) లు శతకాల దిశగా దూసుకువెలుతున్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
SHOT OF THE MATCH. ?
– Shubman Gill smashed Anderson over the head for a six. pic.twitter.com/73BgI4QbyZ
— Johns. (@CricCrazyJohns) March 8, 2024