Lowest Score In Cricket: ఆరు పరుగులకే టీం మొత్తం ఆలౌట్ .. తొమ్మిది మంది డకౌట్..
విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా అండర్ -16 క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. సూరత్‌లోని ఖోల్వాడ్ జింఖానా గ్రౌండ్‌లో మధ్యప్రదేశ్ - సిక్కిం జట్లు తలపడ్డాయి. సిక్కిం జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఆరు పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా చెత్త రికార్డును నమోదు చేసింది.

Lowest Score In Cricket History
Lowest Score In Cricket: దేశవాళీ క్రికెట్ అండర్-16 లో చెత్త రికార్డు నమోదైంది. కేవలం ఆరు పరుగులకే టీం మొత్తం ఆలౌట్ అయింది. అందులో తొమ్మిది మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇలాంటి చెత్తరికార్డు 212 ఏళ్ల క్రితం నమోదైంది. ప్రస్తుతం ఆ రికార్డు బద్దలైంది. ఈ చెత్తరికార్డు నమోదైంది ఎక్కడో కాదు.. మధ్యప్రదేశ్ – సిక్కిం జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో. ఈ మ్యాచ్‌లో సిక్కిం జట్టు ఆటగాళ్లు వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. మధ్యప్రదేశ్ జట్టుకు చెందిన గిరిరాజ్ శర్మ తన అద్భుత బౌలింగ్ తో 1 పరుగు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు.
Pakistan Cricket Board: పీసీబీ చైర్మన్‌గా రమీజ్ రాజా తొలగింపుకు కారణమదేనా?
విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్ -16 క్రికెట్‌లో భాగంగా టెస్ట్ మ్యాచ్ జరిగింది. సూరత్‌లోని ఖోల్వాడ్ జింఖానా గ్రౌండ్‌లో మధ్యప్రదేశ్ – సిక్కిం జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 414 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సిక్కిం జట్టు కేవలం 43 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే సిక్కిం జట్టు ఓటమి దాదాపు ఖాయమైంది. అనంతరం సిక్కిం జట్టు తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో చెత్త రికార్డును నమోదు చేసింది.
రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఆరు పరుగులకే జట్టు ఆటగాళ్లు మొత్తం పెవిలియన్ దారిపట్టారు. ఇందులో తొమ్మిది మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. సిక్కిం జట్టులో గిరిరాజ్ శర్మ ఒక్క పరుగు ఇచ్చి ఐదు వికెట్లు తీయగా, అలీఫ్ హసన్ ఐదు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీశాడు. దీంతో మధ్యప్రదేశ్ జట్టు 365 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సిక్కిం అండర్ -16 క్రికెట్ జట్టు చెత్త ఆటతీరుతో 1810లో రికార్డు బద్దలైంది. ఆ సంవత్సరం జూన్ 12న ఇంగ్లాండ్‌పై బీఎస్ జట్టు ఆరు పరుగులకు ఆలౌట్ అయింది. అప్పటి రికార్డును ఇప్పుడు సిక్కిం అండర్ -16 జట్టు బద్దలు కొట్టినట్లయింది.