Pakistan Cricket Board: పీసీబీ చైర్మన్‌గా రమీజ్ రాజా తొలగింపుకు కారణమదేనా?

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవాదనకూడా వినిపిస్తోంది.. రమీజ్ రాజాను అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నియమించింది. ఇమ్రాన్‌కు రమీజ్ రాజా దగ్గరి వ్యక్తి. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజాను అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్న చర్చ జరుగుతుంది.

Pakistan Cricket Board: పీసీబీ చైర్మన్‌గా రమీజ్ రాజా తొలగింపుకు కారణమదేనా?

Ramiz Raja

Pakistan Cricket Board: పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజాను తొలగించింది. అతని స్థానంలో నజం సేథీ నియమితులయ్యారు. రాబోయే నాలుగు నెలలు బోర్డు వ్యవహారాలను నిర్వహించడానికి నజామ్ సేథీ నేతృత్వంలోని 14 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి సమయంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ జారీ చేసిన ఉత్తర్వులపై ఫెడరల్ క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంది. అలా జరిగితేనే రమీజ్ రాజాను చైర్మన్ పదవి నుంచి తొలగించినట్లవుతుంది.

BCCI vs PCB: పాక్‌లో కాకరేపుతున్న బీసీసీఐ నిర్ణయం.. 23న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తుందా?

2021 సెప్టెంబర్‍‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బోర్డు చైర్మన్ గా రమీజ్ రాజాను నియమించారు. పదిహేను నెలలుగా అతను ఈ పదవిలో కొనసాగుతున్నారు. పీసీబీ 36వ చైర్మన్ గా ఉన్న ఎహసాన్ మణి ఆ పదవి నుంచి వైదొలగడంతో రాజా బాధ్యతలు చేపట్టారు. బోర్డు చైర్మన్ పదవిని చేపట్టిన మాజీ క్రికెటర్లలో రమీజ్ రాజా నాల్గో వ్యక్తి. అంతకుముందు 2008-11 మధ్య కాలంలో ఇజాజ్ బట్, 1994-95 కాలంలో జావేద్ బుర్కీ, 1972-77 కాలంలో అబ్దుల్ హఫీజ్ కర్దార్ బోర్డు చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. అయితే , డిసెంబర్ 26 నుంచి కరాచీలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభంకు కొన్నిరోజుల ముందే పాక్ ప్రభుత్వం రాజాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

Ramiz Raja: ఇంగ్లండ్ చేతిలో స్వదేశంలో పాకిస్తాన్ ఓటమి.. పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజాపై వేటు

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవాదనకూడా వినిపిస్తోంది.. రమీజ్ రాజాను అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నియమించింది. ఇమ్రాన్‌కు రమీజ్ రాజా దగ్గరి వ్యక్తి. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజాను అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పీసీబీ చైర్మన్‌గా నియమితులైన సేథీ కూడా 2013-18 మధ్యకాలంలో పాక్ క్రికెట్ బోర్డ్ చైర్మన్, సీఈవోగా పనిచేశారు. తాజాగా పరిణామాలపై రమీజ్ రాజా ఇప్పటివరకు స్పందించలేదు.