Ramiz Raja: ఇంగ్లండ్ చేతిలో స్వదేశంలో పాకిస్తాన్ ఓటమి.. పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజాపై వేటు

ఇటీవల ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ 3-0తో ఓటమి పాలైంది. పాక్ ఘోర ఓటమితో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Ramiz Raja: ఇంగ్లండ్ చేతిలో స్వదేశంలో పాకిస్తాన్ ఓటమి.. పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజాపై వేటు

Ramiz Raja: ఇటీవల పాకిస్తాన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ ఘోర పరాజయం పాలైంది. స్వదేశంలో 3-0తో ఓటమి పాలైంది. సాధారణంగా ఏ జట్టుకైనా పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌ను ఓడించడం కష్టమైన పని. ఒకవేళ పాక్‌పై ఏ జట్టైనా నెగ్గినా, అది వన్ సైడెడ్‌గా ఉండదు.

Kapu Reservation Bill: కాపుల రిజర్వేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. టీటీపీ ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుబాటు

ప్రత్యర్థి జట్లకు పాక్ గట్టి పోటీ ఇస్తుంటుంది. కానీ, తాజా సిరీస్‌లో మాత్రం పాక్ చతికిలబడింది. ఇంగ్లండ్ చేతిలో వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోయింది. పైగా స్వదేశంలో పాక్ వరుసగా టెస్టు మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో పాక్ జట్టు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. దీనిలో భాగంగా పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాను బాధ్యతల నుంచి తొలగించింది. బుధవారమే ఆయనను విధుల్లోంచి తొలగించినట్లు పీసీబీ వెల్లడిచింది. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సమర్ధించారు. ఆయన పీసీబీలో కూడా సభ్యుడిగా ఉన్నారు. రమీజ్ రాజా స్థానంలో నాజమ్ సేథిని కొత్త ఛైర్మన్‌గా నియమించారు.

Jane Zhang: కావాలని కోవిడ్ వైరస్ అంటించుకున్న చైనీస్ సింగర్.. కారణం తెలిసి తిడుతున్న నెటిజన్లు!

ఇక్కడి రూల్స్ ప్రకారం.. పీసీబీ ఛైర్మన్ పోస్టులకు అర్హతగల సభ్యుల్ని ప్రధాని నామినేట్ చేస్తారు. మిగతా సభ్యులు వారిలోంచి ఒకరిని ఎన్నుకుంటారు. దీంతో పాక్ ప్రధాని సూచన మేరకు నజామ్ సేథిని ఎన్నుకుంది బోర్డు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన సూచనతో, రమీజ్ రాజా గత ఏడాది సెప్టెంబర్‌లో పీసీబీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలంలో పాకిస్తాన్ రెండు టీ20 వరల్డ్ కప్‌లు, ఒక మహిళా వన్డే వరల్డ్ కప్ వంటి టోర్నీలు ఆడింది.