SMAT 2025 : సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో సాయి సుద‌ర్శ‌న్ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స‌ర్లు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ2025లో (SMAT 2025) టీమ్ఇండియా యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్ అద‌ర‌గొడుతున్నాడు.

SMAT 2025 : సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో సాయి సుద‌ర్శ‌న్ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స‌ర్లు

SMAT 2025 Saurashtra vs Tamil Nadu Sai Sudharsan century

Updated On : December 8, 2025 / 9:20 PM IST

SMAT 2025 : సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ2025లో టీమ్ఇండియా యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్ అద‌ర‌గొడుతున్నాడు. ఈ లీగ్‌లో త‌మిళ‌నాడుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సాయి సుద‌ర్శ‌న్ సౌరాష్ట్ర‌తో సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో శ‌త‌కంతో చెల‌రేగాడు. కేవ‌లం 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 101 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

సాయి సుద‌ర్శ‌న్ విధ్వంస‌క‌ర శ‌త‌కానికి తోడుగా సన్నీ సంధు (30; 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌డంతో త‌మిళ‌నాడు 184 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌరాష్ట్ర బౌలర్ల‌లో జయదేవ్‌ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు. అంకుర్‌ పవార్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

IND vs SA : సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌.. కెరీర్ మైల్‌స్టోన్ పై సంజూ శాంస‌న్ క‌న్ను..

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 183 ప‌రుగులు చేసింది. సౌరాష్ట్ర బ్యాట‌ర్ల‌లో విశ్వరాజ్ జడేజా (70; 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), సమ్మర్ గజ్జర్ (66; 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. తమిళనాడు బౌలర్లలో సిలంబరసన్ మూడు వికెట్లు తీశాడు. ముత్తు రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సన్నీ సంధు, రాజ్‌కుమార్ త‌లా ఓ వికెట్ సాధించారు.