Smriti Mandhana : ఆరేళ్ల తరువాత ఐసీసీ నంబర్ 1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్న స్మృతి మంధాన..
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది

Smriti Mandhana becomes ICC No 1 Ranked ODI batter
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఆరు సంవత్సరాల తరువాత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మంధాన అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. 2019లో ఆమె తొలిసారి అగ్రస్థానంలో నిలిచింది.
మంగళవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్‌ను మంధాన అధిగమించింది. మంధాన ఖాతాలో 727 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి ఆ తరువాత నటాలీ స్కైవర్ బ్రంట్, లారా వోల్వార్డ్ట్ లు రెండో స్థానంలో ఉన్నారు.
BCCI : వైభవ్ సూర్యవంశీ పై ఆరోపణలు వచ్చిన కొద్ది నెలల్లోనే బీసీసీఐ కీలక నిర్ణయం..
ఇటీవలి కాలంలో భారత స్టార్ బ్యాటర్ మంధాన.. బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్‌లో ఆమె శ్రీలంకపై సెంచరీ సాధించింది. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 50 కంటే ఎక్కువ సగటుతో 264 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచింది.
Star India batter reclaims her throne at the top in the latest ICC Women’s Player Rankings 🔥
Read more ⬇https://t.co/CFNuOGX2Kt
— ICC (@ICC) June 17, 2025
ఇక ఇదే సిరీస్‌లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ లారా వోల్వార్డ్ట్ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. మూడు మ్యాచ్‌ల్లో 43, 10, 33 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఐదు వన్డేల్లో ఆమె కనీసం ఒక్క అర్థశతకాన్ని కూడా నమోదు చేయలేదు. ఈ క్రమంలోనే అగ్రస్థానాన్ని ఆమె కోల్పోయింది.
ఐసీసీ మహిళల టాప్-5 వన్డే ర్యాంకింగ్స్..
* స్మృతి మంధాన – 727 రేటింగ్ పాయింట్లు
* నటాలీ స్కైవర్ బ్రంట్ – 719 రేటింగ్ పాయింట్లు
* లారా వోల్వార్డ్ట్ – 719 రేటింగ్ పాయింట్లు
* అమీజోన్స్ – 689 రేటింగ్ పాయింట్లు
* ఎల్లీస్ పెర్రీ – 684 రేటింగ్ పాయింట్లు