ICC ODI Rankings : దటీజ్ స్మృతి మంధాన.. ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా..
ఐసీసీ మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

Smriti Mandhana Continues To Lead Latest ODI Batting Rankings
ICC ODI Rankings : టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో శ్రీలంక, పాకిస్తాన్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికి కూడా ఆమె తన స్థానాన్ని కాపాడుకుంది. 791 రేటింగ్ పాయింట్లు మంధాన ఖాతాలో ఉన్నాయి.
ఇంగ్లాండ్ చెందిన నాట్ స్కైవర్-బ్రంట్ 731 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మంధాన, నాట్ స్కైవర్-బ్రంట్ కు మధ్య 60 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. 713 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ కొనసాగుతోంది. న్యూజిలాండ్ పై శతకం బాదిన దక్షిణాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని నాలుగో స్థానానికి చేరుకుంది. ఆమె ఖాతాలో 706 రేటింగ్ పాయింట్లు ఉ్ననాయి.
Harmanpreet Kaur : పాక్‌తో మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత..
మంధాన మినహా మరే భారత ప్లేయర్ టాప్-10లో లేరు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 16వ స్థానంలో, దీప్తి శర్మ 17వ స్థానంలో ఉన్నారు.
ఐసీసీ మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ ఇవే (ICC ODI Rankings) ..
* స్మృతి మంధాన (భారత్) – 791 రేటింగ్ పాయింట్లు
* నాట్ స్కైవర్-బ్రంట్ (ఇంగ్లాండ్) – 731 రేటింగ్ పాయింట్లు
* బెత్ మూనీ (ఆస్ట్రేలియా) – 713 రేటింగ్ పాయింట్లు
* టాజ్మిన్ బ్రిట్స్ (దక్షిణాఫ్రికా) – 706 రేటింగ్ పాయింట్లు
* ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా) – 697 రేటింగ్ పాయింట్లు
ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ 792 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత స్పిన్నర్ దీప్తి శర్మ ఓ స్థానం దిగజారి 6వ స్థానంలో నిలిచింది.
ఐసీసీ మహిళల వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ ఇవే..
* సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్) – 792 రేటింగ్ పాయింట్లు
* ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా) – 697 రేటింగ్ పాయింట్లు
* మేగాన్ స్కట్ (ఆస్ట్రేలియా) – 666 రేటింగ్ పాయింట్లు
* కిమ్ గార్త్ (ఆస్ట్రేలియా) – 663 రేటింగ్ పాయింట్లు
* మారిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా) – 659 రేటింగ్ పాయింట్లు