U-19 World Cup : ఫైనల్ మ్యాచ్‌కు ముందు గంగూలీ.. భారత్ ఆతిథ్యం ఇవ్వకపోవడానికి..
అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాలోని బెనోనిలో జరగనున్న ఫైనల్ మ్యాచులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

Sourav Ganguly explains why India have never hosted the U-19 World Cup
U-19 World Cup 2024 : అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాలోని బెనోనిలో జరగనున్న ఫైనల్ మ్యాచులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఆరోసారి ఈ కప్పును ముద్దాడాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ ఎడిషన్‌తో కలిపి ఇప్పటి వరకు భారత్ తొమ్మిది సార్లు ఫైనల్‌కు చేరుకుంది. 2000లో మహ్మద్ కైఫ్ నాయకత్వంలో తొలిసారి అండర్-19 విజేతగా నిలిచింది. ఆ తరువాత 2008, 2012, 2018, 2022లో గెలుపొందింది. ఈ టోర్నమెంట్‌లో ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ కూడా ఈ టోర్నీకి ఇంత వరకు భారత్ ఆతిథ్యం ఇవ్వలేదు.
మన దేశం అండర్-19 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వకపోవడానికి గల కారణాలను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. ప్రత్యేకించి ఎలాంటి కారణం లేదన్నాడు. క్రికెట్‌ను ప్రపంచంలోని నలుమూలలకు తీసుకువెళ్లడమే ఈ టోర్నీ ప్రధాన ఉద్దేశమని చెప్పాడు. ‘అండర్-19 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వకపోవడానికి ప్రత్యేక కారణం లేదు. ఇతర ప్రపంచకప్‌లకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీ సీనియర్ ప్రపంచకప్‌లు తరుచుగా జరగని ప్రదేశాల్లో నిర్వహిస్తే తప్పు ఏమిటి? ఆటను ఇతర దేశాలకు తీసుకువెళ్లేందుకు ఇది ఓ మార్గం.’ అని గంగూలీ అన్నాడు.
Shreyas Iyer : అయ్యర్ పై వేటు.. నెటిజన్ల మండిపాటు.. రోహిత్ శర్మ, భరత్‌ల కంటే ఎక్కువ..
కాగా.. అండర్-19 ప్రపంచకప్ ద్వారా తగినంత ఆదాయం రాదనే బీసీసీఐ ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడం లేదనే ఓ అభిప్రాయం ఉంది. దీనిపై గంగూలీ స్పందించాడు. అలాంటిది ఏమీ లేదన్నాడు. ఇది నష్టాల టోర్నమెంట్ అని మీరు చెప్పవచ్చు. సీనియర్ పురుషుల జట్లు పాల్గొనని చాలా ప్రపంచకప్‌లు లాభాపేక్ష లేనివి. అయితే.. భారతదేశంలో అండర్-19 ప్రపంచకప్ ఆడకపోవడానికి ఇది కారణం కాదు. త్వరలోనే ఈ టోర్నికి భారత్ ఆతిథ్యం ఇవ్వొచ్చునని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాలు అయిన మలేషియా 2008లో యూఏఈ 2014లో ఈ టోర్నీని నిర్వహించాయి. 2026లో జరగనున్న టోర్నీకి జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
No Ball Six Hit wicket : ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. ఒకే బంతికి నోబాల్, సిక్స్, హిట్‌వికెట్..
ఇదిలా ఉంటే.. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచుల్లో ఆస్ట్రేలియా పై భారత్‌కు మంచి రికార్డు ఉంది. 2012, 2018 ఫైనల్ మ్యాచుల్లో ఆసీస్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. తాజాగా మరోసారి అలాంటి ప్రదర్శననే టీమ్ఇండియా పునరావృతం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.