South Africa Vs Australia ICC Cricket World Cup : ఈడెన్ గార్డెన్స్‌లో రెండవ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం దెబ్బ తగులుతుందా?
కోల్‌కతా నగరంలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండవ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం దెబ్బ తగలనుందా? అంటే అవునంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. కోల్‌కతా నగరంలో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....

Eden Gardens
South Africa Vs Australia ICC Cricket World Cup :కోల్‌కతా నగరంలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండవ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం దెబ్బ తగలనుందా? అంటే అవునంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. కోల్‌కతా నగరంలో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023 రెండవ సెమీఫైనల్ ప్రారంభం కానుంది.
కోల్‌కతా నగరంలో కమ్ముకున్న మేఘాలు
గురువారం మధ్యాహ్నం టాస్ వేసేటపుడు 69 శాతం తేమతో 29 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఈడెన్ గార్డెన్ లో వర్షం నుంచి మైదానాన్ని కాపాడేందుకు స్టేడియం నిర్వాహకులు పిచ్ కవర్లను కప్పారు. కోల్‌కతా నగరంలో మేఘాలు కమ్ముకోవడంతో వర్షం కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ మ్యాచ్‌కు వరుణదేవుడు అడ్డుపడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెదర్ రిపోర్టు చూస్తే విదితమవుతుంది.
వర్షం కురిస్తే ఎలా?
శుక్రవారం కోల్‌కతా నగరంలోని 75 శాతం ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. కోల్‌కతాలో 14.8 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. మ్యాచ్ రిజర్వ్ డేకి వెళితే శుక్రవారం ఆట జరగనుంది. అయితే శుక్రవారం కూడా వర్షం వల్ల ఆట జరిగే అవకాశం లేదని చెబుతున్నారు.
ALSO READ : Anushka Sharma Viral Post : భర్త కోహ్లీపై అనుష్కా శర్మ తాజా కామెంట్… వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టు
ఒక వేళ రిజర్వ్ డేలో కూడా ఆడటం సాధ్యం కాకపోతే, లీగ్ దశ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా కంటే దక్షిణాఫ్రికా పైన నిలిచినందున ఆదివారం జరిగే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో టీమ్ ఇండియాతో తలపడవచ్చని భావిస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాపై ఎడ్జ్ ఉంటుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బుధవారం మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జట్టు గురువారం పూర్తి మ్యాచ్ ఆడాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు.