Mohammed Siraj : సౌతాఫ్రికాపై తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడంపట్ల సిరాజ్ ఏమన్నారో తెలుసా?
టెస్టు క్రికెట్ కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలతో 2024 క్రికెట్ సీజన్ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు.

Mohammed Siraj
IND v SA 2nd test : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండోటెస్టులో వికెట్ల వర్షం కురిసింది. ఒకేరోజు ఏకంగా 23 వికెట్లను ఇరు జట్ల బౌలర్లు పడగొట్టారు. అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టును ప్రారంభంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దెబ్బకొట్టాడు.. కేవలం తొమ్మిది ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది.
రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీయడం పట్ల మహ్మద్ సిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. టెస్ట్ క్రికెట్ నా కెరీర్ కు చాలా ముఖ్యమైనది.. నేను వీలైనన్ని ఎక్కువ టెస్టులు ఆడాలనుకుంటున్నాను. సుదీర్ఘ స్పెల్స్ లో స్థిరంగా ఉండాలి. సవాళ్లను ఎదుర్కోవాలని సిరాజ్ అన్నాడు. ఒకేరోజు రెండు ఇన్నింగ్స్ లలో బౌలింగ్ చేయాలిన అనుకున్నారా? అనే ప్రశ్నకు సిరాజ్ సమాధానమిస్తూ.. మేము అలా అస్సలు అనుకోలేదన్నాడు. సెంచూరియన్ లో జరిగిన మొదటి టెస్టులో ప్రణాళికతో బౌలింగ్ చేయలేక పోయాం. రెండో టెస్టులో ప్రణాళికను అమలు చేశామని సిరాజ్ చెప్పాడు.
Also Read : ఆరుగురు డకౌట్.. 153 పరుగులకు కుప్పకూలిన టీమిండియా
టెస్టు క్రికెట్ కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలతో 2024 క్రికెట్ సీజన్ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని సిరాజ్ తెలిపాడు. తొలి టెస్టు సెంచూరియన్ పిచ్ రెండో టెస్టు కేప్ టౌన్ లోని పిచ్ ఒకే తరహాను పోలి ఉంటాయి. తొలి టెస్టులో నేను బౌలింగ్ చేయని ఏరియాల్లో రెండో టెస్టులో బౌలింగ్ చేశానని సిరాజ్ చెప్పాడు.
Mohammed Siraj said, "Test cricket is very important for my career. I want to play as many Tests as I can. You need to be consistent throughout long spells. You get to tackle challenges, which is something I enjoy". pic.twitter.com/LALubM1FQH
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2024