సుప్రీం ఆదేశాలు : శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత.. BCCI ఆలోచించు

  • Published By: madhu ,Published On : March 15, 2019 / 06:57 AM IST
సుప్రీం ఆదేశాలు : శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత.. BCCI ఆలోచించు

Updated On : March 15, 2019 / 6:57 AM IST

క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట. జీవితకాల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిషేధాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. జీవితకాల నిషేధంపై బీసీసీఐ పునర్ ఆలోచించాలని సూచించింది. శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 15వ తేదీ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. శ్రీశాంత్ తరపున అడ్వకేట్ సల్మాన్ ఖుర్షిద్ వాదనలు వినిపించారు. 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినట్లు శ్రీశాంత్‌పై ఆరోపణలు వచ్చాయి.
Read Also: క్రికెటర్ షమీకి షాక్ : గృహహింస కింద చార్జిషీట్

శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని.. సరైన ఆధారాలు లేవని ఖుర్షిద్ కోర్టుకు తెలిపారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా జీవితకాల నిషేధం ఎలా విధిస్తారని, అలా చేయడం సరికాదని వాదించారు. 2018 ఆగస్టులో కేరళ హైకోర్టు కూడా నిషేధాన్ని తోసిపుచ్చిందని.. అయినా బీసీసీఐ తన నిర్ణయం మార్చుకోలేదని వివరించారు. నిషేధాన్ని తోసిపుచ్చుతున్నట్లు, శిక్షపై మూడు నెలల్లో బీసీసీఐ పున:సమీక్షించాలని ఆదేశించింది.

2013లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌ని పోలీసులు అరెస్టు చేశారు. 2015లో ఢిల్లీ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అయినా.. బీసీసీఐ నిషేధాన్ని తొలగించలేదు. కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. నిషేధం వెంటనే ఎత్తివేయాలని.. 2017 ఆగస్టు 7న బీసీసీఐని ఆదేశించింది. తీర్పును సవాల్ చేస్తూ బీసీసీఐ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించడం.. నిషేధం కొనసాగించాలని కోర్టు తీర్పును సవరించింది. దీంతో శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది. శ్రీశాంత్ ఇండియా తరఫున 27 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్ లు ఆడాడు.
Read Also: కాల్పుల కలకలం : బంగ్లా క్రికేటర్లకు తప్పిన ప్రమాదం