SRHvDC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

SRHvDC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

Updated On : April 4, 2019 / 1:49 PM IST

ఐపీఎల్ లో భాగంగా మరో టఫ్ ఫైట్. ఏప్రిల్ 4వ తేదీ సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ .. ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడేందుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ల మాట అటుంచితే రషీద్ ఖాన్ వర్సెస్ రిషబ్ పంత్ మధ్య మ్యాచ్ లా కనిపిస్తోంది ఈ పోరు. హైదరాబాద్ మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతోంది. ఢిల్లీ జట్టులో మాత్రం 3 మార్పులతో మ్యాచ్ కు సిద్ధమైంది. 

పిచ్ పరిశీలించిన తర్వాత బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపిస్తోన్న పిచ్ పై 180పరుగులకు మించిన స్కోరు నమోదయ్యేలా కనిపిస్తోంది. వరుస 2విజయాల అనంతరం బరిలోకి దిగుతోన్న మ్యాచ్ కావడంతో సన్ రైజర్స్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం క్రితం మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత జరుగుతోన్న మ్యాచ్ కావడంతో తిరిగి ఫామ్ అందుకోవడం కూడా ప్రయత్నిస్తోంది.