Bhanuka Rajapaksa : అంతా తూచ్.. రిటైర్మెంట్‌పై మాట మార్చిన శ్రీలంక ప్లేయర్..!

పదిరోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతలోనే ఏమైందో.. అంతా తూచ్ అంటూ మాట మార్చేశాడు లంక్ ఆటగాడు భానుక రాజపక్స.. రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకున్నాడు..

Bhanuka Rajapaksa : అంతా తూచ్.. రిటైర్మెంట్‌పై మాట మార్చిన శ్రీలంక ప్లేయర్..!

Sri Lanka Player Bhanuka Rajapaksa Withdraws From Retirement, Wants To Play For Sri Lanka Again

Updated On : January 13, 2022 / 8:46 PM IST

Bhanuka Rajapaksa : పదిరోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతలోనే ఏమైందో.. అంతా తూచ్ అంటూ మాట మార్చేశాడు లంక్ ఆటగాడు భానుక రాజపక్స.. రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకున్నాడు.. ఇంకా ఆడాలని ఉందని తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. 30 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేసి.. శ్రీలంక క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించాడు రాజపక్స.

రాబోయే మ్యాచ్‌ల్లో జట్టుకు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. లంక యువజన క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స జోక్యంతో భానుక తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టుగా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవలే.. లంక క్రికెట్‌ బోర్డు కొత్త ఫిట్‌నెస్ రూల్స్‌ ప్రవేశపెట్టింది. ఆ నిబంధలను నిరసిస్తూ భానుక రాజపక్సతో పాటు దనుష్క రాజపక్స కూడా రిటైర్మెంట్ ప్రకటన చేశారు. వీరిద్దరి రిటైర్మెంట్ ప్రకటనతో లంక క్రికెట్‌లో ఒక్కసారిగా పెనుదుమారాన్ని రేపింది. భానుక, దనుష్క రిటైర్మెంట్ నిర్ణయంపై రాజకీయ నేతలతో పాటు మాజీ ఆటగాళ్లు, సీనియర్లు అందరూ షాక్ అయ్యారు.

రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించాలని మాజీ పేసర్ లసిత్ మలింగ ట్విట్టర్ వేదికగా వీరిద్దరిని కోరాడు. శ్రీలంక కొత్త ఫిట్‌నెస్‌ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది. నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి చేయలేకపోతే వేతనాల్లో కోత విధింపు ఉంటుంది.

Read Also : Ind Vs SA : రసవత్తరంగా కేప్‌టౌన్ టెస్టు.. సౌతాఫ్రికా టార్గెట్ 212.. పంత్ ఒంటరి పోరాటం