Ind Vs SA : రసవత్తరంగా కేప్‌టౌన్ టెస్టు.. సౌతాఫ్రికా టార్గెట్ 212.. పంత్ ఒంటరి పోరాటం

కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్ననిర్ణయాత్మక మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సఫారీల ముందు..

Ind Vs SA : రసవత్తరంగా కేప్‌టౌన్ టెస్టు.. సౌతాఫ్రికా టార్గెట్ 212.. పంత్ ఒంటరి పోరాటం

Ind Vs Sa Cape Town

Ind Vs SA : కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సఫారీల ముందు 212 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టార్గెట్ స్వల్పమే అయినా, పిచ్ పరిస్థితి చూస్తుంటే టార్గెట్ చేధించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.

కాగా, భారత వికెట్ కీపర్, యంగ్ సెన్సేషన్ రిషభ్ పంత్ ఒంటరి పోరాటం చేశాడు. వీరోచిత సెంచరీ చేశాడు. పంత్ 100 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించని పిచ్ పై ఎంతో సంయమనంతో ఆడిన పంత్.. 133 బంతుల్లో 100 పరుగులు చేశాడు. పంత్ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి.

India Open 2022: ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌కు క‌రోనా..టోర్నీ నుంచి అవుట్

తొలి ఇన్నింగ్స్‌ 13 పరుగుల ఆధిక్యం కలుపుకుని భారత్‌ 211 పరుగుల లీడ్‌ సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 57/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు (పుజారా, రహానె) కోల్పోయి కష్టాల్లో పడింది.

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్‌ పంత్‌ ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (29) ఫర్వాలేదనిపించాడు. కోహ్లి చాలా నిదానంగా ఆడాడు. 143 బంతులు ఆడిన కెప్టెన్ కోహ్లి 29 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యం (94) నెలకొల్పాడు పంత్.

అయితే కోహ్లీ సహా ఓవైపు వికెట్లు పడుతున్నా.. పంత్‌ ఆఖరి వరకు నిలకడగా రాణించాడు. సఫారీ బౌలర్ల దెబ్బకు మిగతా భారత బ్యాటర్లు విఫలమయ్యారు. కేఎల్‌ రాహుల్ 10, మయాంక్‌ అగర్వాల్ 7, పుజారా 9, రహానె 1, అశ్విన్‌ 7, శార్దూల్‌ ఠాకూర్‌ 5 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 223 పరుగులకు ఆలౌట్ కాగా… దక్షిణాఫ్రికా 210 పరుగులకే ఆలౌట్ అయింది.

Peanuts : పల్లీలు తింటే బరువు పెరుగుతారా?

212 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీ జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 23 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. ఓపెన్ మార్ క్రమ్ ను(16) షమీ ఔట్ చేశాడు.