శ్రీనివాస్ గౌడ నాచ్చురల్ సిక్స్ పాక్.. సీక్రెట్ ఇదే!

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 11:09 AM IST
శ్రీనివాస్ గౌడ నాచ్చురల్ సిక్స్ పాక్.. సీక్రెట్ ఇదే!

Updated On : February 20, 2020 / 11:09 AM IST

బురద నీటిలో కేవలం 9.55 సెకన్లలో 100మీటర్ల పరుగెత్తి కర్ణాటకలోని సంప్రదాయ క్రీడ కంబాలా రేస్(దున్నపోతుల పరుగు)లో శ్రీనివాస్ గౌడ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. మరి ఈ కంబాలా రేస్ లో పాల్గొనడానికి తను ఎలాంటి ఆహారం తీసుకున్నాడో తాజాగా మీడియాకు చెప్పాడు శ్రీనివాస్ గౌడ.
 
మనందరం జిమ్ కి వెళ్లి సిక్స పాక్ తెచ్చుకుంటాం.. కానీ శ్రీనివాస్ గౌడ ప్రతీరోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి గంజీ తాగుతాడు, మధ్యాహానం లంచ్ కి చేపలు, చికెన్ తింటాడు. ఇలా రోజు చేపలు తినడం అనేది తనకు అలవాటు అని చెప్పారు. చేపలు తినడం వల్లే తనకి అంత దృడత్వం, స్టామినా వచ్చాయని శ్రీనివాస్ అన్నాడు. వాటితో పాటుగా ప్రతీరోజు డ్రై ఫ్రూట్స్ కచ్చితంగా తింటాడట. అలాగే కొబ్బరితో చేసే చెట్నీలు, కొబ్బరి నూనెతో చేసిన వంటకాలని తింటానని చెప్పారు.

అంతేకాదు ప్రతీరోజు ఉదయాన్నే లేచి కటినమైన యోగా కూడా చేస్తాడు. దాంతోపాటు తన గురువు కంబాలా అకాడమీకి చెందిన ప్రొఫెసర్ గుణపాల కదంబ దగ్గర నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు నా ఎదుగుదలకి, నా బిహేవియర్ కి కారణమని తెలిపారు శ్రీనివాస్ గౌడ.

ఇక కంబాలా రేస్ లో పాల్గోనాలంటే కచ్చితంగా ప్రతీ వ్యక్తి జంతువులను బాగా అర్ధం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వారు గేదెలకు నూనెతో మంచిగా మసాజ్ చేయాలి. పేడను శుభ్రం చేయాలి అని తెలిపారు. ఇంకోవిషయం ఏంటంటే.. గౌడ కుటుంబంలో గేదెలు లేవు. దీంతో అతను ఈ జంతువులతో ఆడుకోవడం కోసం పాఠశాల అయిన తర్వాత ప్రతిరోజూ తన పక్కింటికి వెళ్లేవాడు. ఇది చూసి అక్కడి ప్రజలు తనకు బలమైన చేతులు ఉన్నాయని, అతను కంబాలాలో పాల్గొంటే చాలా బాగుంటుందని చెప్పడంతో అతను కంబాలా అకాడమీలో చేరాడు.