KKR vs SRH IPL 2021: రైజర్స్ vs రైడర్స్.. టాస్ హైదరాబాద్‌దే..

KKR vs SRH IPL 2021: రైజర్స్ vs రైడర్స్.. టాస్ హైదరాబాద్‌దే..

రైజర్స్ Vs రైడర్స్.. టాస్ హైదరాబాద్‌దే..

Updated On : April 11, 2021 / 7:54 PM IST

IPL 2021 3rd Match LIVE: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ మూడవ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‍‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుండగా.. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల కెప్టెన్లు విదేశీయులే. ఒక వైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉండగా, మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా ఎయోన్ మోర్గాన్ ఉన్నారు.

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మొత్తం 19 మ్యాచ్‌లు జరగగా.. వీటిలో 12 మ్యాచ్‌లను కోల్‌కతా జట్టు గెలుచుకుంది. 7 సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నారు. గత నాలుగు మ్యాచ్‌ల విషయానికి వస్తే కోల్‌కతా జట్టు మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. అదే సమయంలో హైదరాబాద్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. గత సీజన్‌లో కోల్‌కతాతో జరిగిన రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్ ఓడిపోయింది. అటువంటి పరిస్థితిలో, వార్నర్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు కోల్‌కతాను ఓడించేందుకు శ్రమపడాల్సి ఉంది.

ఈ క్రమంలోనే టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుని కోల్‌కత్తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

Kolkata Knight Riders (Playing XI):
శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (డబ్ల్యూ), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Sunrisers Hyderabad (Playing XI):
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా(WK), మనీష్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ