SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్, రిలీజ్ లిస్ట్ ఇదే.. ఏకంగా 8 మందికి షాక్..

స‌న్‌రైజ‌ర్స్ (SRH) కూడా త‌మ జాబితాను విడుద‌ల చేసింది.

SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్, రిలీజ్ లిస్ట్ ఇదే.. ఏకంగా 8 మందికి షాక్..

Sunrisers Hyderabad IPL 2026 Retained And Released Players list

Updated On : November 15, 2025 / 6:46 PM IST

SRH : ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధ‌మైంది. అబుదాబి వేదిక‌గా డిసెంబర్ 16న మినీ వేలం జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మినీవేలానిక‌న్నా ముందు రిటెన్షన్ ప్రక్రియను బీసీసీఐ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే విడుద‌ల చేసే ఆట‌గాళ్ల జాబితాను విడుద‌ల చేశాయి. అదే విధంగా స‌న్‌రైజ‌ర్స్ (SRH) కూడా త‌మ జాబితాను విడుద‌ల చేసింది.

రిటెన్ చేసుకున్న ఆట‌గాళ్లు వీరే..
పాట్ కమిన్స్ (కెప్టెన్‌), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, జీషన్ అన్సారీ.

IPL 2026 : ఐపీఎల్ 2026 రిటెన్షన్‌, రిలీజ్ పూర్తి లిస్ట్ ఇదే.. ఏ జ‌ట్టు ఎవ‌రిని వ‌దిలివేసింది, ఎవ‌రిని అట్టిపెట్టుకుందంటే..?

విడుద‌ల చేసిన ఆట‌గాళ్లు వీరే..
మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్, అథర్వ టైడే, సచిన్ బేబీ, సిమర్జిత్ సింగ్

Sanju Samson : అందుకే రాజస్తాన్‌ రాయల్స్‌ను వీడాను.. సంజూ శాంసన్ పోస్ట్.. తొలి నాళ్ల‌లోని ఫోటో షేర్ చేసి..

పర్స్ వాల్యూ.. రూ.25.5 కోట్లు